పత్రికా స్వేఛ్చను కేసీఆర్ హరించారు
గడిచిన పదేళ్లలో పత్రిక స్వేఛ్చను హరించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జర్నలిస్టులను గత ప్రభుత్వం విపరీతంగా ఇబ్బందులు పెట్టిందని గుర్తు చేశారు.
గతంలో కేసిఆర్ జర్నలిస్టులతో హిప్నాటిజం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర్ రెడ్డి మాత్రమే జర్నలిస్టులకు మేలు చేశారని చెప్పారు. మార్పు కావాలని ప్రభుత్వాన్ని ఎన్నుకున్న మనమే అన్ని సాధించుకుంటామన్నారు.
యుధ్ద ప్రాతిపదికన జర్నలిస్టులకు భూములు స్వాధీనం చేస్తామని తెలిపారు. ఖమ్మంలో జర్నలిస్టులకు రెండు మూడు రోజుల్లో క్లియర్ చేస్తామని వెల్లడించారు. హెల్త్ కార్డు సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.
కొత్త ప్రభుత్వ ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర చాలా గొప్పదని అన్నారు. అమరులైన జర్నలిస్టులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు. జర్నలిస్టుల పై దాడుల గురించి నియంత్రణ చట్టం రూపొందిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.