ఈ సర్పంచ్ రూటే సెపరేటు అధికారంలో ఉన్న లేకున్నా అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళ్తారు ప్రజల మన్ననలు అందుకుంటున్న సర్పంచ్ చంద్రపై ప్రత్యేక కథనం Ck news చిత్తూరు జిల్లాపలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం,కీలపట్ల గ్రామం అంటే టక్కున గుర్తు వచ్చేది కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిరూపమైన శ్రీ కోనేటిరాయ స్వామిగా ప్రజలకు దర్శనమిస్తున్న విషయం స్ఫురిస్తుంది. అందులో కీలపట్ల దేవస్థానం ఎండోమెంట్ పరమైనప్పటినుండి భక్తుల తాకిడి మరింత పెరిగింది.కీలపట్ల పంచాయతీ,సర్పంచ్ చంద్రశేఖర్ అప్పటి వైసిపి …

ఈ సర్పంచ్ రూటే సెపరేటు

అధికారంలో ఉన్న లేకున్నా అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళ్తారు

ప్రజల మన్ననలు అందుకుంటున్న సర్పంచ్ చంద్రపై ప్రత్యేక కథనం

Ck news చిత్తూరు జిల్లా
పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం,
కీలపట్ల గ్రామం అంటే టక్కున గుర్తు వచ్చేది కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిరూపమైన శ్రీ కోనేటిరాయ స్వామిగా ప్రజలకు దర్శనమిస్తున్న విషయం స్ఫురిస్తుంది.

అందులో కీలపట్ల దేవస్థానం ఎండోమెంట్ పరమైనప్పటినుండి భక్తుల తాకిడి మరింత పెరిగింది.
కీలపట్ల పంచాయతీ,సర్పంచ్ చంద్రశేఖర్ అప్పటి వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా టిడిపి సర్పంచ్ గా గెలిచి తన పంచాయతీ పరిధిలో ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా వదిలిపెట్టకుండా

రోడ్లు డ్రైనేజీలే కాకుండా, ఆయన దగ్గరికి వచ్చిన ప్రజా సమస్యను తన సమస్యగా భావించి ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని ప్రజలు సర్పంచ్ చంద్ర పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు.

సర్పంచ్ చంద్రను ఆదర్శంగా తీసుకొని నియోజకవర్గంలో ఉన్న సర్పంచులు కూడా తమ పరిధిలోని సమస్యలను పూర్తిచేస్తే, పలమనేరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకు వెళ్తుందని ప్రజలు మేధావులు అభిప్రాయపడ్డారు.

Updated On 19 Jun 2024 11:27 AM IST
cknews1122

cknews1122

Next Story