రివాల్వర్ చూపించి మహిళా కానిస్టేబుల్‌పై ఓ ఎస్సై అత్యాచారం
రివాల్వర్ చూపించి మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం తుపాకీతో బెదిరింపులు రివాల్వర్ చూపించి తోటి మహిళా కానిస్టేబుల్‌ను రెండు సార్లు రేప్ చేసాడు ఓ ఎస్సై. అందిన సమాచారం ప్రకారం… తాను మంత్రి శ్రీధర్ బాబు మనిషిని అని చెప్పుకొని సిబ్బందిని బెదిరిస్తున్నాడు కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ గౌడ్. భూపాలపల్లి జిల్లా: జూన్19రివాల్వర్ చూపించి ఓ మహిళా కానిస్టేబుల్‌పై ఎస్ఐ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఓ పోలీసు అధికారి ఈ ఘటన భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్ …
రివాల్వర్ చూపించి మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం
తుపాకీతో బెదిరింపులు
రివాల్వర్ చూపించి తోటి మహిళా కానిస్టేబుల్‌ను రెండు సార్లు రేప్ చేసాడు ఓ ఎస్సై. అందిన సమాచారం ప్రకారం… తాను మంత్రి శ్రీధర్ బాబు మనిషిని అని చెప్పుకొని సిబ్బందిని బెదిరిస్తున్నాడు కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ గౌడ్.
భూపాలపల్లి జిల్లా: జూన్19
రివాల్వర్ చూపించి ఓ మహిళా కానిస్టేబుల్‌పై ఎస్ఐ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఓ పోలీసు అధికారి
ఈ ఘటన భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో జరగగా ఎస్ఐ భవానీసేన్‌పై నిన్న కేసు నమోదైంది.
విధుల్లో ఉన్న తనపై హత్యా చారం చేశాడని, ఎవరికైనా చెప్తే చంపేస్తానని ఎస్ఐ బెదిరించినట్లు బాధితు రాలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
దీంతో ఎస్ఐ భవానీసేన్‌ను ఉన్నతాధికారులు అదుపు లోకి తీసుకున్నారు. కాళేశ్వ రం పోలీస్ స్టేషన్ లో నిన్న అర్ధరాత్రి ఇద్దరు డీఎస్పీలు, సీఐలతో విచారణ చేపట్టారు.
గతంలో కూడా ఓ యువతి తో అసభ్యంగా ప్రవర్తించినం దుకు ఎస్ఐ సస్పెండ్ అయినట్లు తెలుస్తోంది…
ఎస్సై భవాని సేన్ గౌడ్ తన ఇంటి దగ్గరలో ఉండే ఓ మహిళా కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి “ఇంట్లో జారి పడి కాలు విరిగింది లేవలేకపోతున్నాను.. వచ్చి సాయం చేయమని” ప్రాధేయపడ్డాడు.
ఇంటికి వచ్చిన ఆమెని సర్వీస్ రివాల్వర్ చూపించి బెదిరించి రేప్ చేశాడు. ఎవరికైనా చెప్తే ఇదే నీ చివరి రోజు అని బెదిరించాడు. రెండు రోజుల క్రితం ఆ మహిళా కానిస్టేబుల్ ఇంట్లోకి చొరబడి మరోసారి రేప్ చేశాడట.
తాను శ్రీధర్ బాబు మనిషిని అని తనని ఎవరూ ఏమీ చేయలేరని సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. చోటా మోటా నాయకులు ఎవరైనా పోలీస్ స్టేషన్ వస్తే “బాబన్న (శ్రీధర్ బాబు) బావున్నాడా.. నాకు ఇంతకు ముందే ఫోన్ చేశాడు” అంటూ మాట్లాడేవాడు.
ఈయన పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో 15 చికెన్ సెంటర్లు ఉండగా ప్రతిరోజూ ఒక చికెన్ సెంటర్ నుండి పావుకిలో చికెన్ పంపాలని హుకుం జారీ చేశాడు. ఆటో డ్రైవర్లు, చిల్లర వ్యాపారులను ఎవరినీ వదలకుండా రూ. 100 కూడా వదలకుండా వసూళ్లకు పాల్పడేవాడు.