తెలంగాణకు హోంమంత్రి ఎక్కడ?
బిఆర్ఎస్ ట్విట్..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గరి నుండి నేరాలు , అత్యాచారాలు , భూకబ్జాలు , దోపిడీ ఇలా అనేక నేరాలు , ఘోరాలు ఎక్కువైపోయానంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
మరి ముఖ్యంగా వారం రోజుల దగ్గరి నుండి రాష్ట్రంలో క్రైమ్ విపరీతంగా పెరిగింది. చుట్టూ జనాల మద్యే కత్తులతో దాడులు చేయడం..నడిరోడ్డు ఫై కర్రలతో విచక్షణరహితంగా కొట్టడం వంటి ఘటనలు రాష్ట్ర ప్రజలను భయబ్రాంతులకు గురి చేసాయి.
నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా ఓ వ్యక్తిని కర్రలతో కొట్టి చంపిన ఘటన, హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్లో అందరూ చూస్తుండగా సమీర్ అనే యువకుడిని దారుణంగా పొడిచి చంపడం , పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం..
అంతే కాకుండా ప్రజలకు న్యాయం జరిగేలా అండగా నిలబడాల్సిన పోలీసులే తోటి మహిళ సిబ్బందిపై అత్యాచారానికి ఒడిగట్టడం ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనం అని బిఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
కేవలం బిఆర్ఎస్ పార్టీ అనే కాదు మహిళలు , ప్రజలు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఫై మండిపడుతున్నారు. అసలు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది ఉందా అని..ఉంటె ఈ నేరాలు ఏంటి..అసలు వారు తమ పని చేస్తున్నారా..? లేక ఇంట్లో ఉంటున్నారా..? అని విమర్శిస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలోనే రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపు చేసేందుకు ఓ హోంమంత్రి కావలంటూ బీఆర్ఎస్ ట్విట్టర్ వేదిక ఓ సైటైరికల్ పోస్ట్ ట్విట్ చేసింది ‘తెలంగాణకు హోం మంత్రి కావలెను..!
తొమ్మిదిన్నరేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల శాంతిభద్రతలు క్షీణించాయి. ఘర్షణలు, హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.
గత ఆరు నెలలుగా రాష్ట్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు తెలంగాణకు హోంమంత్రి లేడు.. ప్రజల భద్రతను పట్టించుకునే దిక్కే లేదు. అందుకే వెంటనే తెలంగాణకు హోంమంత్రి కావలెను! అంటూ బీఆర్ ట్వీట్ చేసింది. మరి దీనికి కాంగ్రెస్ సర్కార్ ఏ సమాధానం చెపుతుందో చూడాలి.