తిరుమలకు పాదయాత్ర పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలం, జూన్ 20 సి కె న్యూస్ ప్రతినిధి. వేంకటాద్రి సమం స్థానం, బ్రహ్మండే నాస్తికించన. వేంకటేశ సమోదేవో, నభూతో నభవిష్యతి.తిరుమలను మించిన పవిత్ర పుణ్యక్షేత్రం, వేంకటేశ్వరుని మించిన దైవం లేదని దీని అర్థం. వివరాలు ఇలా ఉన్నాయి. గంగవరం మండలం చౌడిరెడ్డిపల్లి పంచాయతీకి చెందిన, బత్తనపల్లి, మిట్టమీద కురప్పల్లి, చౌడిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన 110 మంది తిరుమల కు పాదయాత్రగా ఈరోజు ఉదయం బయలుదేరి వెళ్లారు.వెంకటేశ్వర స్వామి భక్తులు …

తిరుమలకు పాదయాత్ర

పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలం, జూన్ 20 సి కె న్యూస్ ప్రతినిధి.

వేంకటాద్రి సమం స్థానం, బ్రహ్మండే నాస్తికించన. వేంకటేశ సమోదేవో, నభూతో నభవిష్యతి.తిరుమలను మించిన పవిత్ర పుణ్యక్షేత్రం, వేంకటేశ్వరుని మించిన దైవం లేదని దీని అర్థం.

వివరాలు ఇలా ఉన్నాయి. గంగవరం మండలం చౌడిరెడ్డిపల్లి పంచాయతీకి చెందిన, బత్తనపల్లి, మిట్టమీద కురప్పల్లి, చౌడిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన 110 మంది తిరుమల కు పాదయాత్రగా ఈరోజు ఉదయం బయలుదేరి వెళ్లారు.

వెంకటేశ్వర స్వామి భక్తులు మాట్లాడుతూ....

ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కాలినడకన తిరుమలకు మా గ్రామస్తులందరూ వెళతామని ,గోవింద నామస్మరణలతో, పండరి భజనలతో, మూడు రోజులపాటు మా యాత్ర కొనసాగుతుందని, తిరుమలకు ఆదివారం చేరుకుంటామని,

మా సొంత ఖర్చులతో, మా గ్రామస్తులు అందరూ కలిసి చందాలు వేసుకొని, దారి పొడవునా..... ఖర్చులకు వాడుకుంటామని, ఈ సందర్భంగా పాదయాత్రీకులు తెలియజేశారు.

ప్రతి సంవత్సరం వర్షాలు బాగా పడి, పంటలు బాగా పండాలని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తామని, ఈ సందర్భంగా వారు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో చౌడిరెడ్డిపల్లి, బత్తనపల్లి, కురపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.

Updated On 20 Jun 2024 3:50 PM IST
cknews1122

cknews1122

Next Story