బొగ్గు బ్లాక్ లను బే షరతుగా సింగరేణికి అప్పగించాలి:బ్రాంచ్ కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్
సి కే న్యూస్ ఇల్లందు నియోజకవర్గ ప్రతినిధి,
జూన్ 21,
ఎఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆద్వర్యంలో ఇల్లందు ఏరియా జెకెఓసి, సిహెచ్పి, సేక్యూరిటి డిపార్ట్మెంట్ ల వద్ద బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి వివిధ గనుల అధికారులకు వినతిపత్రాలు అందజేశారు
వివిధ గనుల వద్ద జరిగిన కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్, ఉపాద్యక్షులు దాసరి రాజారామ్ లు మాట్లాడుతూ దేశంలో బొగ్గు బ్లాక్ ల వేలం పాటని ఏఐటీయూసీ వ్యతిరేకిస్తుందని అన్నారు.
సార్వత్రిక ఎన్నికల ముందు సింగరేణిని ప్రైవేటిక రించబోమని ఆ ఆలోచన లేదని ప్రధానమంత్రి హోదాలో ప్రకటన చేసిన మోడీ ప్రభుత్వం నేడు జరగబోయే బొగ్గు గనుల వేలం పాటలో తెలంగాణలోని శ్రావణ్ పల్లి బొగ్గు బ్లాక్ ను చేర్చడం దేనిని సూచిస్తుందని అన్నారు.
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సింగరేణి విస్తరించి ఉన్న ప్రాంతాలలోని బొగ్గు బ్లాక్ లను. సింగరేణి కి కేటాయించాలని తద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.
ఇంతకుముందు ప్రైవేట్ వారికి కేటాయించిన సత్తుపల్లి, కోయగూడెం బ్లాక్ లను కూడా సింగరేణికే కేటాయించాలని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం 21న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి సింగరేణికి గనులు కేటాయించాలని లేఖ రాయాలని కోరారు.
సింగరేణి లొ 42 వేల మంది రెగ్యులర్,22 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని రాష్ట్రంలో40 బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతొందని ప్రస్తుతం 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతొందని అన్నారు
2030 కల్ల బొగ్గు ఉత్పత్తి తగ్గిపొయో ప్రమాదం ఉందని అందుకు అదికమించాలంటే నూతన గనుల అవష్యకత అవసరం ఉందని నూతన గనులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని అన్నారు.
సింగరేణి సంస్థ రక్షణ, కార్మికుల హక్కుల పరిరక్షణ కొరకు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుందని ప్రభుత్వాలు ప్రజల,కార్మికుల అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రైవేట్ వారికి అప్పగిస్తే ఏఐటియుసి ఆధ్వర్యంలో పోరాటా లు నిర్వహిస్తామని అన్నారు
ఈ కార్యక్రమంలొ బ్రాంచ్ సహయ కార్యదర్శి గడదాసు నాగేశ్వరరావు, ఫిట్ కార్యదర్శులు సంజీవ చారి, నూనె శ్రీనివాస్, దాట్ల వెంకటేశ్వర్లు, ఎస్ రవి,జక్కుల శ్రీనివాస్, ప్రసాద్ రెడ్డి, గౌతమ్ రావు, వాసం వేంకటేశ్వర్లు, హూసేన్ తదితరులు పాల్గొన్నారు