నారాయణ కాలేజీ గోడ దూకేందుకు ప్రయత్నించి విద్యార్థి మృతి హైదరాబాద్ : ప్రమాదవశాత్తు ఇంటర్ విద్యార్థి మృతిచెందిన విషాద ఘటన హయత్‌ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తనకు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు తనను హాస్టల్ ల్లో వేశారంటూ గిరీష్ కుమార్ అనే విద్యార్థి గురువారం అర్ధరాత్రి కళాశాల గొడ దూకేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోన గోడపై ఉన్న విద్యుత్ తీగలు గిరీష్ కుమార్‌ తలకు తగలడంతో అతడు అక్కడికక్కడే …

నారాయణ కాలేజీ గోడ దూకేందుకు ప్రయత్నించి విద్యార్థి మృతి

హైదరాబాద్ : ప్రమాదవశాత్తు ఇంటర్ విద్యార్థి మృతిచెందిన విషాద ఘటన హయత్‌ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. తనకు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు తనను హాస్టల్ ల్లో వేశారంటూ గిరీష్ కుమార్ అనే విద్యార్థి గురువారం అర్ధరాత్రి కళాశాల గొడ దూకేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలోన గోడపై ఉన్న విద్యుత్ తీగలు గిరీష్ కుమార్‌ తలకు తగలడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అయితే, గిరీష్ విగత జీవిగా పడి ఉండటాన్ని చూసిన తోటి విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందజేశారు.

అనంతరం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శుక్రవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అప్పటి వరకు తమతో ఉన్న గిరిష్ కుమార్ మృతి చెందడంతో తోటి విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగి పోయారు…

Updated On 21 Jun 2024 4:37 PM IST
cknews1122

cknews1122

Next Story