కేసీఆర్ కు దెబ్బ మీద దెబ్బ.. సీఎం రేవంత్ తో పోచారం భేటి పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమిపాలైన బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ లీడర్లంతా ఒక్కొక్కరిగా కారు దిగేందుకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నేతలంతా ఇప్పుడు అధికార పార్టీలోకి వెళ్లేందుకు మంతనాలు జరుపుతున్నారనే చర్చ జోరందుకుంది. ఈ సమయంలోనే కీలక పరిణామం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. …

కేసీఆర్ కు దెబ్బ మీద దెబ్బ.. సీఎం రేవంత్ తో పోచారం భేటి

పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమిపాలైన బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ లీడర్లంతా ఒక్కొక్కరిగా కారు దిగేందుకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నేతలంతా ఇప్పుడు అధికార పార్టీలోకి వెళ్లేందుకు మంతనాలు జరుపుతున్నారనే చర్చ జోరందుకుంది. ఈ సమయంలోనే కీలక పరిణామం జరిగింది.

సీఎం రేవంత్ రెడ్డితో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా తన నివాసానికి ఆహ్వానించారు పోచారం.

ఈ భేటిలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ లోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పోచారంను కోరినట్టు తెలుస్తుంది.

మరోవైపు బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కారు దిగేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇటీవలే గచ్చిబౌలిలోని ఓ ఎమ్మెల్సీ నివాసంలో రహస్యంగా భేటీ అయినట్టు సమాచారం.

ఇప్పటికే తెల్లం వెంకట్ రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి హస్తం గూటికి చేరుకున్నారు. ఇప్పుడు పోచారం సైతం సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో బీఆర్ఎస్ ను వీడనున్నారని చర్చ జోరందుకుంది.

Updated On 21 Jun 2024 2:16 PM IST
cknews1122

cknews1122

Next Story