ప్రైవేట్‌ కాలేజీలో ఫుడ్‌ పాయిజన్‌… సుమారు 40 మంది విద్యార్థులకు అస్వస్థత నగరంలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కొండాపూర్‌ లో చోటు చేసుకుంది.శ్రీచైతన్య కాలేజీ వాల్మీకి బ్రాంచ్‌ కొండాపూర్ లో చదువుకుంటున్న విద్యార్థులు గురువారం రాత్రి భోజనం తిన్న తరువాత తీవ్ర కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. యాజమాన్యానికి విద్యార్థులు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ఏఐవైఎఫ్‌ …

ప్రైవేట్‌ కాలేజీలో ఫుడ్‌ పాయిజన్‌…

సుమారు 40 మంది విద్యార్థులకు అస్వస్థత

నగరంలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కొండాపూర్‌ లో చోటు చేసుకుంది.
శ్రీచైతన్య కాలేజీ వాల్మీకి బ్రాంచ్‌ కొండాపూర్ లో చదువుకుంటున్న విద్యార్థులు గురువారం రాత్రి భోజనం తిన్న తరువాత తీవ్ర కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు.

యాజమాన్యానికి విద్యార్థులు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ఏఐవైఎఫ్‌ కి సమాచారం అందించారు. వారు క్యాంపస్‌ కు చేరుకోని యాజమాన్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల్లో ఫీజులు తీసుకుంటూ విద్యార్థులకు సరైన ఆహారాన్ని అందించడం లేదని వారు మండిపడ్డారు.

40 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన కనీసం యాజమాన్యం పట్టించుకోకపోవడంతో వారు ఇప్పటికైనా విద్యార్థులను ఆసుపత్రికి తరలించాలని వారు డిమాండ్‌ చేశారు.

Updated On 21 Jun 2024 8:42 PM IST
cknews1122

cknews1122

Next Story