భాస్కర్ నగర్ గడ్డ మట్టి మాఫీయా కి అడ్డా… హై స్పీడ్ తో మట్టి ట్రాక్టర్ల పోకడాలు. పల్టీ కొట్టిన ట్రాక్టర్. పట్టుకోండి చూద్దాం అంటూ సవాల్.. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్), జూన్ 21, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక పంచాయతీ పరిధిలోని భాస్కర్ నగర్ గడ్డ మట్టి మాఫీయా కి అడ్డాగా మారినది. ఒక పక్క అక్రమ మట్టి తొలకాలు చేస్తూ …

భాస్కర్ నగర్ గడ్డ మట్టి మాఫీయా కి అడ్డా…

హై స్పీడ్ తో మట్టి ట్రాక్టర్ల పోకడాలు. పల్టీ కొట్టిన ట్రాక్టర్.

పట్టుకోండి చూద్దాం అంటూ సవాల్..

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

జూన్ 21,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక పంచాయతీ పరిధిలోని భాస్కర్ నగర్ గడ్డ మట్టి మాఫీయా కి అడ్డాగా మారినది. ఒక పక్క అక్రమ మట్టి తొలకాలు చేస్తూ ట్రాక్టర్ల ముందు చక్రాలు గాలిలొ లేపుతూ నిర్లక్ష్యంగా ట్రాక్టర్లు నడుపుతున్న వైనం.

మమ్మల్ని ఆపేది ఎవరు…? మమ్మల్ని పట్టుకోండి చూద్దాం మా (స్పీడ్) ఏ వేరు అంటూ సవాల్ అడ్డొస్తే ఏమన్న జరగొచ్చు అంటూ విలేకరులతో ఓనర్లు సవాల్ విసురుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం మిషన్ల ద్వారా ట్రాక్టర్లకు లోడ్ చేస్తూ నడుస్తున్న మట్టి మాఫీయా.

నడి రోడ్డు పై అధిక స్పీడ్ తో వెళ్తున్న మట్టి ట్రాక్టర్…తృటిలో తప్పిన ప్రమాదం. ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు ఈ "హై స్పీడ్" మట్టి మాఫియా ట్రాక్టర్లను పట్టుకొని హై రేంజ్ ఫైన్లు వేస్తే తప్ప వీరిలో మార్పు రాదని ప్రజలు వేడుకుంటూ కోరుకుంటున్నారు.

Updated On 21 Jun 2024 7:49 PM IST
cknews1122

cknews1122

Next Story