
లంచం తీసుకుంటూ చిక్కిన జీఎస్టీ ఉద్యోగులు
Web desc : హైదరాబాద్: సొంత సంస్థలో పనిచేసి.. ఉద్యోగ విరమణ పొందిన అధికారికి బకాయిలు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన జీఎస్టీ/కస్టమ్స్ శాఖ అధికారులు సీబీఐకి దొరికిపోయారు.
హైదరాబాద్ జీఎస్టీ/కస్టమ్స్ విభాగం సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్ ప్రకాశ్‌రావు, సీనియర్ అసిస్టెంట్ సుదర్శన్ రూ.25 వేల లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఇదే విభాగంలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన బాధితుడు తనకు రావాల్సిన బిల్లుల కోసం సదరు అధికారులను సంప్రదించగా రూ.30 వేల లంచం డిమాండ్ చేశారు.
బేరసారాల అనంతరం రూ.25 వేలు ఇవ్వాలంటూ స్పష్టం చేశారు. ఈక్రమంలో బాధితుడు సీబీఐని సంప్రదించగా మాటువేసి ఇద్దరు అధికారులను పట్టుకున్నారు.