బెంగళూరు రోడ్డు ప్రమాదంలో సత్తుపల్లి యువకుడు మృతి
సీ కే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునిర్.
సత్తుపల్లి పట్టణ పరిధిలోని జోహార్ నగర్ కు చెందిన ఆముదాల అబ్రహం కుమారుడు ఆముదాల ప్రకాష్ 22.(వెంకటేశ్వరరావు) బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో టాటా కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంపికై ఈనెల 15 వ తారీకు సత్తుపల్లి నుంచి బెంగళూరుకు వెళ్లి ఉద్యోగంలో జాయిన్ అయి విధులు నిర్వహిస్తుండగా శుక్రవారం రాత్రి విధులకు హాజరయ్యేందుకు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా గుర్తు తెలియని వాహనం బలంగా ఢీ కొనడంతో తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందాడు,
మృతుడి వివరాలు సేకరించిన బెంగళూరు పోలీసులు సత్తుపల్లి లో వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు,
బెంగళూరులో ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతుడి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రకాష్ మృతితో సత్తుపల్లి జహార్ నగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి,.