లంచం తీసుకుంటుండగా… ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సీఐ
కుత్బుల్లాపూర్ : ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తూల్యాండ్ గ్రాబర్ కేసులు ఎదుర్కుంటున్న సాయి రాజ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎసిబి అధికారులు సూరారం పోలీస్ స్టేషన్ సిఐ వెంకటేశం పై దాడులు నిర్వహించారు.
ఓ ప్రభుత్వ భూమి విషయంలో భూ కబ్జాల కింద సాయిరాజ్ పై కేసులు నమోదయ్యాయని, రౌడి షీట్ తెరిచే అవకాశం ఉందంటూ సీఐ వెంకటేశం రూ.5లక్షలు డిమాండ్ చేశాడు. ఇది వరకే సాయిరాజ్ రూ.2లక్షలు ఇవ్వగా.. మళ్లీ డబ్బు ఇవ్వాలని సీఐ సాయిరాజ్ ని డిమాండ్ చేస్తున్నాడు.
ఈక్రమంలోనే బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ లో వెంకటేశం రూ.లక్ష లంచంగా తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా అవినీతి నిరోధక శాఖా అధికారులకు పట్టుబడ్డాడు.
సిఐ వెంకటేశం ఇంటితో పాటు బందువుల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఆనంద్ కుమార్ వివరాలు వెల్లడించారు.