సికింద్రబాద్ లోని మెట్టగూడలో కాల్పుల కలకలంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దొంగలను నియంత్రించేందుకు ముందస్తు ప్రణాళికల్లో భాగంగా యాంటీ డెకాయిట్ టీం సభ్యులు సర్ ప్రైజ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా డెకాయిట్ టీం సభ్యులు మారువేషంలో ఫుట్ పాత్ పై పడుకున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన దొంగల ముఠా ఫుట్ పాత్ పై పడుకున్న వ్యక్తి ఫోన్ ను చోరీ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో యాంటీ డెకాయిట్ టీం సభ్యుడు అతన్ని పట్టుకునే …
![చిలకలగూడలో అర్ధరాత్రి కాల్పులు కలకలం చిలకలగూడలో అర్ధరాత్రి కాల్పులు కలకలం](https://cknewstv.in/wp-content/uploads/2024/06/n618891766171904274489007522a01eafe8c3b01149e8b926b75f0a0f28795c3fb0de188fe4c9790caa8b2.jpg)
సికింద్రబాద్ లోని మెట్టగూడలో కాల్పుల కలకలంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దొంగలను నియంత్రించేందుకు ముందస్తు ప్రణాళికల్లో భాగంగా యాంటీ డెకాయిట్ టీం సభ్యులు సర్ ప్రైజ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఇందులో భాగంగా డెకాయిట్ టీం సభ్యులు మారువేషంలో ఫుట్ పాత్ పై పడుకున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన దొంగల ముఠా ఫుట్ పాత్ పై పడుకున్న వ్యక్తి ఫోన్ ను చోరీ చేసేందుకు ప్రయత్నించారు.
దీంతో యాంటీ డెకాయిట్ టీం సభ్యుడు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో దొంగల ముఠాకు డెకాయిట్ టీం సభ్యులకు తోపులాట జరిగింది.
ఈ క్రమంలో పోలీస్ వద్ద ఉన్న రివాల్వర్ మిస్ ఫైర్ అయినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అలాగే గత కొద్ది రోజులుగా దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే పరారీలో ఉన్న వారి కోసం గాలింపు కొనసాగుతుందని అన్నారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)