జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత… కిటికీ అద్దాలు ధ్వంసం.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత ఇలాకలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రోజులుపాటు పర్యటనలో భాగంగా ఆయన పులివెందుల నివాసానికి వెళ్లారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గత ఐదేళ్ల పాటు తాడేపల్లిలో ఉండి.. ఇప్పుడు పులివెందులకు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముకుమ్మడిగా జగన్ ఇంట్లోకి చొరబడి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. జగన్‌కు వ్యతిరేకంగా …

జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత… కిటికీ అద్దాలు ధ్వంసం..

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత ఇలాకలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రోజులుపాటు పర్యటనలో భాగంగా ఆయన పులివెందుల నివాసానికి వెళ్లారు.

దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గత ఐదేళ్ల పాటు తాడేపల్లిలో ఉండి.. ఇప్పుడు పులివెందులకు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముకుమ్మడిగా జగన్ ఇంట్లోకి చొరబడి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో అటు పోలీసులు సైతం కట్టడి చేయలేకపోయారు.

ఈ ఊహించని పరిణామంతో అటు పార్టీ శ్రేణులు సైతం అవాక్కయ్యారు. ఎంత సర్ది చెప్పినా పార్టీ కార్యకర్తలు వినలేదు. ఇప్పటికైనా జగన్ పులివెందులలో అందుబాటులో ఉండాలని సూచించారు.

Updated On 22 Jun 2024 8:05 PM IST
cknews1122

cknews1122

Next Story