యోగా తో ఆరోగ్యం,ప్రశాంతత సీకే న్యూస్ ప్రతినిధి, పెంట్లవెల్లి: పెంట్లవెల్లి మండల ఎంపీడీవో ప్రసన్న కుమారి అంతర్జాతీయ పదవ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జటప్రోలు గ్రామంలో నిర్వహించిన యోగ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెంట్లవెల్లి మండల ఎంపీడీవో ప్రసన్న కుమారి. అనంతరం ఆమె గ్రామపంచాయితీ కార్మికులతో మరియు గ్రామ ప్రజలతో కలిసి యోగ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యజీవితంలో రోజూవారి దినచర్యలో భాగంగా యోగ చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలను …

యోగా తో ఆరోగ్యం,ప్రశాంతత

సీకే న్యూస్ ప్రతినిధి, పెంట్లవెల్లి:

పెంట్లవెల్లి మండల ఎంపీడీవో ప్రసన్న కుమారి

అంతర్జాతీయ పదవ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జటప్రోలు గ్రామంలో నిర్వహించిన యోగ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెంట్లవెల్లి మండల ఎంపీడీవో ప్రసన్న కుమారి.

అనంతరం ఆమె గ్రామపంచాయితీ కార్మికులతో మరియు గ్రామ ప్రజలతో కలిసి యోగ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యజీవితంలో రోజూవారి దినచర్యలో భాగంగా యోగ చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలను గ్రామ ప్రజలకు మరియు గ్రామపంచాయతీ సిబ్బంది కార్మికులకు వివరించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ ఉదయాన్నే యోగా చేయడం వలన ఆరోగ్యం గా ఉండవచ్చునని ఆరోగ్యంగా ఉండడం ద్వారా ఎలాంటి రోగాలు రాకుండా సంతోషంగా మీ కుటుంబంతో గడపవొచ్చని ఆమె గుర్తు చేశారు అలాగే యోగా వలన మనిషికి ప్రశాంతత లభిస్తుందని దాని ద్వారా అనుకున్న కార్యక్రమాలను సాధించగలుగుతామని ఆమె తెలిపారు

యోగ చేయడం వలన ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని ఆమె మాట్లాడుతూ తెలిపారు ఈ కార్యక్రమంలో జటప్రోలు గ్రామపంచాయతీ కార్యదర్శి సుల్తానా బేగం, ఏపీవో మోహన్ కృష్ణ , గ్రామ కారోబార్ ఖాజ, గ్రామపంచాయతీ కార్మికులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Updated On 22 Jun 2024 9:07 AM IST
cknews1122

cknews1122

Next Story