రైలు ప్రమాదంలో జబర్దస్త్‌ ఆర్టిస్ట్ దుర్మరణం కొత్తగూడెం : ముందుకు కదులుతున్న రైలెక్కేందుకు ప్రయత్నించిన ఓ టీవీ ఆర్టిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. ఈ ఘటన శుక్రవారం కొత్తగూడెంలో చోటుచేసుకుంది. కొత్తగూడెం రైల్వే ఎస్సై సురేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చుంచుపల్లి మండలం నందాతండాకు చెందిన మహ్మద్దీన్‌ (53) భద్రాచలం రోడ్‌ రైల్వే స్టేషన్‌ కొత్తగూడెం,కు ఉదయం వచ్చారు. అదే సమయంలో ముందు కు కదులుతున్న కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కేందుకు ప్రయత్నించారు. …

రైలు ప్రమాదంలో జబర్దస్త్‌ ఆర్టిస్ట్ దుర్మరణం

కొత్తగూడెం : ముందుకు కదులుతున్న రైలెక్కేందుకు ప్రయత్నించిన ఓ టీవీ ఆర్టిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు.

ఈ ఘటన శుక్రవారం కొత్తగూడెంలో చోటుచేసుకుంది. కొత్తగూడెం రైల్వే ఎస్సై సురేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చుంచుపల్లి మండలం నందాతండాకు చెందిన మహ్మద్దీన్‌ (53) భద్రాచలం రోడ్‌ రైల్వే స్టేషన్‌ కొత్తగూడెం,కు ఉదయం వచ్చారు.

అదే సమయంలో ముందు కు కదులుతున్న కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కేందుకు ప్రయత్నించారు. కిందకు జారిపడటంతో రైలు, ప్లాట్‌ ఫాం మధ్య ఇరుక్కుపో యాడు.

వెంటనే లోపలున్న ప్రయాణి కులు చైన్‌లాగడంతో లోకో పైలెట్‌ రైలును ఆపారు. రైల్వే పోలీసులు సిబ్బంది సహాయంతో మహ్మద్దీన్‌ను బయటకు లాగి ‘108’లో కొత్తగూడెం జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించారు.

నడుము, పక్కటెముకలకు తీవ్రగాయాలైన బాధితుడికి వైద్యులు అత్యవసర చికిత్స విభాగంలో సేవలందించారు. డా.రోషిణి సూచనలతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఖమ్మం తరలిస్తుండగా మార్గం మధ్యలో అతడు మృతి చెందాడు.

మృతదేహాన్ని సర్వజన ఆస్పత్రి శవాల గదిలో భద్రపరిచారు. డ్యూటీ వైద్యురాలి ఫిర్యాదుతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

మహ్మద్దీన్‌ ఈటీవీ జబర్దస్త్‌ లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 50 ఎపి సోడ్స్‌లలో పలు పాత్రలు పోషించారు. షూటింగ్‌ ఉందని చెప్పి శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఉదయం స్టేషన్‌కు వచ్చారు.

ప్రమాదవశాత్తు మృత్యు వాతపడ్డారు. మృతుడికి భార్య, డిగ్రీ, పదోతరగతి చదివే ఇద్దరు కుమార్తెలున్నారు. మహ్మద్దీన్‌ మృతితో నందాతండాలో విషాదం అలుముకుంది.

కళాకారుడిగా రాణిస్తూ కుమార్తెలు చదివించుకుంటున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించడంపై స్థానికులు విచారం వ్యక్తం చేశారు…

Updated On 22 Jun 2024 10:26 AM IST
cknews1122

cknews1122

Next Story