స్టంట్ మాస్టర్ భార్యపై 15 వీధికుక్కల దాడి!
స్టంట్ మాస్టర్ భార్యపై 15 వీధికుక్కల దాడి! ఇటీవలి కాలంలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది. ఇది ఒక ప్రాంతానికే పరిమితం కాదు. అన్ని ప్రాంతాల్లోనూ కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు వీటి బారిన పడి తీవ్ర గాయాల పాలవుతున్నారు.కొందరి ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా అలాంటి ఓ దారుణమైన ఘటన హైదరాబాద్ మణికొండలోని చిత్రపురి హిల్స్‌లో జరిగింది. స్టంట్ మాస్టర్ బద్రి చిత్రపురి హిల్స్‌లోనే నివాసం ఉంటున్నారు. ఆయన భార్య …
![స్టంట్ మాస్టర్ భార్యపై 15 వీధికుక్కల దాడి! స్టంట్ మాస్టర్ భార్యపై 15 వీధికుక్కల దాడి!](https://cknewstv.in/wp-content/uploads/2024/06/n61893980317190733789208eaf3026b4416acf8e87f6c05906b3182722b4e64c3aea37c4f550a7c105fe32.jpg)
స్టంట్ మాస్టర్ భార్యపై 15 వీధికుక్కల దాడి!
ఇటీవలి కాలంలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది. ఇది ఒక ప్రాంతానికే పరిమితం కాదు. అన్ని ప్రాంతాల్లోనూ కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు వీటి బారిన పడి తీవ్ర గాయాల పాలవుతున్నారు.
కొందరి ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా అలాంటి ఓ దారుణమైన ఘటన హైదరాబాద్ మణికొండలోని చిత్రపురి హిల్స్‌లో జరిగింది.
స్టంట్ మాస్టర్ బద్రి చిత్రపురి హిల్స్‌లోనే నివాసం ఉంటున్నారు. ఆయన భార్య శనివారం ఉదయం 6 గంటలకు వాకింగ్ చేసేందుకు బయటికి రాగా ఒక్కసారి 15 కుక్కలు ఆమెపై దాడి చేశాయి.
దాదాపు 10 నిమిషాల పాటు వాటితో పోరాడిన ఆ మహిళ ప్రాణాలతో బయటపడిరది. ఈ ఘటనపై స్టంట్ మాస్టర్ బద్రి స్పందిస్తూ 'ఈరోజు ఉదయం ఈ దారుణమైన ఘటన జరిగింది.
మా మిసెస్‌పై 15 కుక్కలు దాడి చేశాయి. అది ఎంత దారుణంగా ఉందో వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.
ఇక్కడ నివాసం ఉంటున్న వారికి నేనొక విన్నపం చెయ్యాలనుకుంటున్నాను. మీరు కుక్కలకు ఫుడ్ పెట్టాలనుకుంటే దయచేసి బయటికి తీసుకెళ్ళి పెట్టండి.
ఒకవేళ మీరు కుక్కలని ఇష్టపడేవారయితే వీధిలో ఉండే రెండు కుక్కలను తీసుకొచ్చి ఇంట్లో పెంచుకోండి. అంతేకానీ ఇలా కాలనీ లోపలే ఫుడ్ పెట్టడం వల్ల అవి ఇక్కడి వారిపైనే దాడి చేస్తున్నాయి.
మా మిసెస్ వయసులో పెద్దది కాబట్టి సరిపోయింది. అదే పిల్లలైతే ప్రాణాలతో ఉండేవారా. అందరూ అర్థం చేసుకోండి' అన్నారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)