Andhra Pradesh

భర్త ప్రవర్తన నచ్చక ఆత్మహత్య చేసుకున్న భార్య, ఆపై భర్త కూడా…

భర్త ప్రవర్తన నచ్చక ఆత్మహత్య చేసుకున్న భార్య, ఆపై భర్త కూడా…

Web desc : జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను. జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో పొర పాటు చేశాను. భార్యను పోషించలేని వ్యక్తిని ప్రేమించి పెళ్లాడాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను.
ఎన్నిసార్లు చెప్పినా ఆయనలో మార్పు రావడం లేదు.

చేసిన తప్పునకు నాకు నేనే శిక్ష వేసుకుంటు న్నాను. అంటూ ఓ వివాహిత సెల్ఫీ వీడియో తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భార్య ఉరికి వేలాడుతూ కనిపించడాన్ని తట్టుకోలేని ఆ భర్త కూడా అదే గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటన విజయవాడ నగరంలోని రామలింగేశ్వరనగర్‌ భవానీ రోడ్డులో శుక్రవారం జరిగింది. కృష్ణాజిల్లా బంటుమిల్లికి చెందిన నాగరాజు (40), అవనిగడ్డకు చెందిన ప్రణీత (35) ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పిల్లలు లేరు. నాగరాజు తాపీపని చేస్తుంటాడు.

అతడికి మద్యం అలవాటు ఉండటంతో సంపాదించిన డబ్బుతో కుటుంబం గడవని పరిస్థితి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రణీత ఇంటి వద్ద టైలరింగ్‌ చేస్తూ కొంత సంపాదిస్తోంది. అయినా సమస్యలు పరిష్కారం కావడం లేదు.

మద్యం అలవాటు వదిలేయాలని పలుమార్లు భర్తను ప్రాధేయపడింది. అతడిలో ఎలాంటి మార్పు రాలేదు. విసిగిపోయిన ప్రణీత ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీనికి ముందు తన సెల్‌ఫోన్‌లో ఓ సెల్ఫీ వీడియో తీసుకుంది.

తాను నాగరాజును ప్రేమించినప్పటి నుంచి ఇప్పటి వరకు అనుభవించిన నరకాన్ని ప్రస్తావించి, శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుంది.

భోజనానికి ఇంటికి వచ్చిన నాగరాజు బెడ్‌రూమ్‌లో ప్రణీత ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే రామలింగేశ్వరనగర్‌ కట్టపై ఉంటున్న ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌చేసి విషయం చెప్పాడు.

ప్రణీత ఆత్మహత్య చేసుకుందని, ఇక తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. అనంతరం నాగరాజు కూడా అదే గదిలో ఉరేసుకున్నాడు. స్థానికులు పటమట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button