జీవో నెంబర్ 3 మరలా ఇంప్లిమెంట్ చేయాలి కలెక్టర్కు వినతి పత్రం
భారతీయ గోర్ బంజారా జిల్లా అధ్యక్షులు బానోతు దుర్గాప్రసాద్
సీకే న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గం బాధావత్ హాథిరాం నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ గోర్ బంజారా పోరాట సమితి, ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు కంటెస్టెడ్ ఎమ్మెల్యే బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారిని కలిసి G.O. 3 మరియు G.O. 33 ప్రకారం గిరిజనులకు 100% రిజర్వేషన్ ఇవ్వాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది
అలాగే గిరిజనుల హక్కులను కాపాడడానికి వారికి విద్య, ఉద్యోగ, ఉపాధి లో నందు రిజర్వేషన్ 100% రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వము భారత రాజ్యాంగం 5వ షెడ్యూల్ ప్రకారం జీవో నెంబర్ 3 నీ తీసుకురావడం జరిగింది అప్పటినుంచి గిరిజనులు జీవో నెంబర్ 3 ద్వారా వివిధ విద్య ఉపాధి ఉద్యోగాలలో 10% రిజర్వేషన్ పొందుతూ గిరిజనులు అభివృద్ధి చెందడానికి ఎంతో గాను ఉపయోగపడింది.
ఈ క్రమంలో గత 3 సంవత్సరాల క్రితం BRS ప్రభుత్వం G.O.No. 3 నీ కుట్రపూరితంగా రద్దుచేసి గిరిజనులకు తీరని అన్యాయం చేసింది ఇప్పుడిప్పుడే అభివృద్ధిలో ముందుకు వస్తున్న గిరిజనులు G.O. 3 రద్దుతో తిరిగి వెనుకబాటుతనానికి గురి అవుతున్నారు
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చినందున గిరిజనుల తరఫున గిరిజనుల పక్షాన కలెక్టర్ గారిని కలిసి తగిన న్యాయం చేయాలని G.O.3నీ తిరిగి మరల ఇంప్లిమెంట్ చేయాలనీ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఇంచార్జ్ నాగరాజు చౌహాన్ మరియు పాల్వంచ మండల అధ్యక్షుడు విజయ్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు