PoliticalTelangana

తడిబట్టలతో ప్రమాణం చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

తడిబట్టలతో ప్రమాణం చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రమాణం చేశారు. ఫ్లైయాష్ విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలు చెల్పూరు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రమాణం చేయాలని సవాళ్లు విసురుకొన్నారు.

శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని పోలీసులు కౌశిక్ రెడ్డిని గృహ నిర్భంధం చేశారు. దీంతో తన ఇంట్లోనే తడిబట్టలతో ఆంజనేయస్వామి ఫొటోపై కౌశిక్ రెడ్డి ప్రమాణం చేశారు.

నేను ఎలాంటి అవినితీ చేయలేదని ప్రమాణం చేస్తున్నా..పొన్నం ప్రభాకర్‌కి ఫ్లై యాష్‌తో సంబంధం లేదని ప్రమాణం చేయాలి.. దాంతో పాటు.. లోడ్ లారీలను ఎందుకు ఆపడం లేదో…

ఆ లోడ్ లారీల నుంచి .. వాటా రావడం లేదని.. పొన్నం ప్రభాకర్ ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. అలా ప్రమాణం చేస్తే… నేనూ బహిరంగ క్షమాపణ చెబుతా అంటూ మీడియా సాక్షిగా వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button