BhadrachalamPoliticalTelangana

మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

మూడు సంవత్సరాల చిన్నారిపై లైంగిక అత్యాచారం చేసిన మూర్ఖున్ని కఠినంగా శిక్షించాలి.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బూర్గంపాడు మండలం లో సోమవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. సారపాక పంచాయతీ గాంధీ నగర్ కాలనీలో అదే కాలనీకి చెందిన ఓ కామాంధుడు మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

దీంతో చిన్నారి తల్లితండ్రులు బూర్గంపాడు పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు.వారి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారని సమాచారం. కాగా ప్రస్తుతం ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మూడు సంవత్సరాల చిన్నారిపై లైంగిక అత్యాచారం చేసిన మూర్ఖున్ని కఠినంగా శిక్షించాలి.

ఐద్వా మహిళా సంఘం.

బేళ్లు కూడా రాకుండా కేసులు పెట్టాలని సారపాక సెంటర్లో ఐద్వా మహిళా సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం. దిశ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.

ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర నాయకురాలు మాహ లక్ష్మి మాట్లాడుతూ బూర్గంపాడు మండలం గాంధీ నగరంలో చిన్నారిపై అత్యాచారం చేసిన జార్ఖండ్ కు చెందిన కుందల్ కు జీవితాంతం బయటికి రాకుండా అధికారులు ఆ రకమైన కేసులు పెట్టాలని అన్నారు.

చిన్నారి పై జరిగిన సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నామని దారుణమైన బాధాకరమైన విషయం పోలీసు వారు ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినమైన శిక్షలు విధించాలని కూడా డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమం లో ఐద్వా రాష్ట్ర నాయకురాలు లీలావతి బూర్గంపాడు మండల కార్యదర్శి పాపినేని సరోజన వ్యకస మండల అధ్యక్షులు ఎస్.కె అబీదా జ్యోతి రాధా, కౌవులూరి నాగమణి మరియమ్మ దిశ ఎం అన్నపూర్ణ, యు అనిత సుజాత, ఏ శారద వ్యకస జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button