క్షణికావేశం.. నర్సింగ్‌ విద్యార్థిని విషాదం! కాలేజీకి పంపించడం లేదనే మనస్తాపంతో నర్సింగ్‌ విద్యార్థిని బానోత్‌ అక్షయ(19) సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునింది. స్థానిక సంతోష్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సింగరేణిలో ప్రైవేట్‌ ఓల్వో డ్రైవర్‌గా పనిచేస్తున్న బానోత్‌ రాజేశం- అమృతలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్నకుమార్తె అక్షయ కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ నర్సింగ్‌ కాలేజీలో సెకండియర్‌ చదువుతోంది. పరీక్షలు ముగిశాక మూడు నెలల క్రితం వేసవి సెలవుల …

క్షణికావేశం.. నర్సింగ్‌ విద్యార్థిని విషాదం!

కాలేజీకి పంపించడం లేదనే మనస్తాపంతో నర్సింగ్‌ విద్యార్థిని బానోత్‌ అక్షయ(19) సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునింది. స్థానిక సంతోష్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. సింగరేణిలో ప్రైవేట్‌ ఓల్వో డ్రైవర్‌గా పనిచేస్తున్న బానోత్‌ రాజేశం- అమృతలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

చిన్నకుమార్తె అక్షయ కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ నర్సింగ్‌ కాలేజీలో సెకండియర్‌ చదువుతోంది. పరీక్షలు ముగిశాక మూడు నెలల క్రితం వేసవి సెలవుల కోసం ఇంటికి వచ్చింది. అయితే, సెలవులు ముగిశాయయని, కాలేజీకి వెళ్తానని తన తండ్రికి చెప్పింది.

తనకు వేతనం ఇంకా రాలేదని, వచ్చిన తర్వాత కాలేజీ ఫీజు చెల్లించి పంపిస్తానని తండ్రి చెప్పాడు. తనను కాలేజీకి పంపించడం లేదనే మనస్తాపంతో తన గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్న అక్షయ.. గంట సమయం గడిచినా బయటకు రాలేదు.

కుటుంబసభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యానుకు వేళాడుతూ విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు, తోబుట్టువులు బోరున విలపించారు.

చిన్నవిషయాలకే అలిగిన తమ కుమార్తె చనిపోతుందని తాము ఉహించలేదని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి సోదరి అనిల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై సనత్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Updated On 25 Jun 2024 12:11 PM IST
cknews1122

cknews1122

Next Story