జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోగలరు అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్
సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం : నేడు కూసుమంచి మండలం పాలేరులోని బి.వి. రెడ్డి ఫంక్షన్ హాల్లో చేపట్టే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర యువజన సర్వీసులు, టిజి ఎస్ టిఇపి, హైదరాబాద్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం 10.00 గంటల నుండి జాబ్ మేళా ఏర్పాటుచేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఫార్మా, ఐటి, మార్కెటింగ్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, కాల్ సెంటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్, అడ్మినిస్ట్రేషన్, రియల్ ఎస్టేట్, రిటైల్, హౌజ్ కీపింగ్, స్టోర్ మేనేజర్, డెలివరీ బాయ్, వెల్డర్, ఫిట్టర్, చెఫ్, డ్రైవర్ మున్నగు విభాగాల్లో ఏమీ చదువుకొనని వారు మొదలుకొని పీజీ అర్హతలు కలిగిన యువతీ యువకులు ఇట్టి జాబ్ మేళా లో పాల్గొనవచ్చని ఆయన అన్నారు.
ప్రాముఖ్యత జలిగిన 65 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొని 5 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని, నిరుద్యోగ యువత ఉపాధికి ఇది సువర్ణావకాశమని అదనపు కలెక్టర్ తెలిపారు.
నిరుద్యోగ యువతీ యువకులు https://forms.gle/aWH1uo5poS6RrT3D6 లింక్ ద్వారా కాని లేదా క్రింద ఫోటోలోని క్యూఆర్ కోడ్ ను కానీ స్కాన్ చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు హెల్ప్ లైన్ నెంబర్లు 8886711991, 9642333668 లను సంప్రదించాలని అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.