హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రత పాటించాలి… అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్
ఖమ్మం, జూన్ 26: హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రతను పాటించాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి కిరణ్ కుమార్ తో కలిసి వైరా రోడ్ లోని స్పందన ఫుడ్ పాలెస్, కోణార్క్ రెస్టారెంట్, పాత బస్టాండ్ రోడ్ లోని శ్రీ ప్రియలక్ష్మి బేకరీ & జనరల్ స్టోర్స్ ల ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కిచెన్, కిచెన్ పరిసరాలు, సరుకులు, ఫ్రిడ్జ్ లలో నిల్వ పదార్థాలు పరిశీలించారు.
ఆహార పదార్థాల ప్యాక్ లపై కాలపరిమితి ని పరిశీలించారు. రెస్టారెంట్ లో వాడే ప్రతి ప్యాక్ కి తయారీ, కాలపరిమితి నమోదు ఉండాలని, కాలపరిమితి దాటిన పదార్థాలు వాడరాదని అన్నారు. కిచెన్ లో పనిచేసే వారందరు శుభ్రంగా వుండేలా, చేతులకు, తలకు మాస్క్ లు ధరించేల చూడాలన్నారు.
రుచి కొరకు హానికర రసాయనాలు వాడి, ప్రజల ఆరోగ్యం దెబ్బతినెలా ఉంటే ఉపేక్షించేది లేదని ఆయన తెలిపారు. వినియోగదారులకు పరిశుభ్రమైన, హై జెనిక్ ఆహార పదార్థాలు అందజేయాలన్నారు. కిరాణా జనరల్ స్టోర్స్ లో ప్రతి ప్యాకింగ్ పై తయారు, కాలపరిమితి తేదీలు, తయారీదారు, గరిష్ట అమ్మకం ధర ఉండాలన్నారు.
కల్తీ వస్తువులు అమ్మరాదని, వినియోగదారులకు నష్టం కలిగించే చర్యలు చేస్తే, కఠిన చర్యలుంటాయని ఆయన అన్నారు. తహశీల్దార్లు హోటళ్లు, రెస్టారెంట్లు, కిరాణా షాపుల తనిఖీలు చేపడతారని అదనపు కలెక్టర్ తెలిపారు.
అదనపు కలెక్టర్ తనిఖీల సందర్భంగా ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సిహెచ్. స్వామి, ఆర్ఐ లు రమేష్, రవి, అధికారులు తదితరులు ఉన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, ఖమ్మం కార్యాలయంచే జారిచేయనైనది.