ఇంకోసారి కాంగ్రెస్ గురించి పిచ్చిగా మాట్లాడితే బాగుండదు : జగ్గారెడ్డి మాస్ వార్నింగ్
ఇంకోసారి కాంగ్రెస్ గురించి పిచ్చిగా మాట్లాడితే బాగుండదు : జగ్గారెడ్డి మాస్ వార్నింగ్ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ పార్టీ గురించి ఇంకోసారి పిచ్చిగా మాట్లాడితే బాగుండదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) వార్నింగ్ ఇచ్చారు.తాను చిన్నప్పుడు ఆర్ఎస్‌ఎస్ శాఖకి వెళ్లానని అన్నారు. తాను శాఖకు పోయినప్పుడు రఘునందన్‌కి శాఖ గుర్చి తెలియదన్నారు. తాను ఎంత కష్టపడుతానో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి తెలుసు నని చెప్పారు. రఘునందన్‌ది బీజేపీలో చిన్న వయస్సు అని తెలిపారు. ఈరోజు(బుధవారం) …
![ఇంకోసారి కాంగ్రెస్ గురించి పిచ్చిగా మాట్లాడితే బాగుండదు : జగ్గారెడ్డి మాస్ వార్నింగ్ ఇంకోసారి కాంగ్రెస్ గురించి పిచ్చిగా మాట్లాడితే బాగుండదు : జగ్గారెడ్డి మాస్ వార్నింగ్](https://cknewstv.in/wp-content/uploads/2024/06/images-1-8-3.jpeg)
ఇంకోసారి కాంగ్రెస్ గురించి పిచ్చిగా మాట్లాడితే బాగుండదు : జగ్గారెడ్డి మాస్ వార్నింగ్
మెదక్ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ పార్టీ గురించి ఇంకోసారి పిచ్చిగా మాట్లాడితే బాగుండదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) వార్నింగ్ ఇచ్చారు.తాను చిన్నప్పుడు ఆర్ఎస్‌ఎస్ శాఖకి వెళ్లానని అన్నారు.
తాను శాఖకు పోయినప్పుడు రఘునందన్‌కి శాఖ గుర్చి తెలియదన్నారు. తాను ఎంత కష్టపడుతానో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి తెలుసు నని చెప్పారు. రఘునందన్‌ది బీజేపీలో చిన్న వయస్సు అని తెలిపారు. ఈరోజు(బుధవారం) గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.
తన క్యారెక్టర్ ఏంటో బండారు దత్తాత్రేయకి తెలుసునని ఉద్ఘాటించారు. తాను బీజేపీలో ఉన్న సమయంలో తనకు తల్లిలాగా లేదని, అప్పుడు తానే తల్లిపాత్ర పోషించి ఆ పార్టీకి గుర్తింపు తెచ్చానని తెలిపారు.
తాను బీజేపీలో ఉన్నప్పుడు బీజేపీ ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదని చెప్పారు. రఘునందన్ పుస్తకాలు చదివిండు.తాను జీవితాన్ని చదివానని అన్నారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను కలుస్తానని తెలిపారు.
ITIR తేవాలని ఇద్దరు కేంద్ర మంత్రులను అడుగుతానని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో తెలంగాణకు ITIR ఇస్తే ప్రధానమంత్రి నరేంద్రమోదీ పక్కన పెట్టారని మండిపడ్డారు. హైదారాబాద్‌ను అనుకొని నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా ITIR పై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
హైదరాబాద్ కి ITIR వస్తే కోట్లాది పెట్టుబడులు వస్తాయని చెప్పుకొచ్చారు. ITIR హైదరాబాద్ తేవాలని కేంద్ర మంత్రులను కలుస్తానని అన్నారు. ITIR తెచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)