సీఎం రేవంత్‌ పర్యటన రేపటికి వాయిదా సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్‌ నగర పర్యటన శనివారానికి వాయిదా పడింది. శుక్రవారం వివిధ అభివృద్ధి పనుల పరిశీలన, సమీక్ష నిర్వహించాల్సి ఉండగా ఆ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.టూర్‌ షెడ్యూల్‌ కూడా ఖరారు కాగా, చివరి నిమిషంలో వాయిదా పడింది. తొలుత విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం.. వరంగల్‌ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు, మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ పరిశీలన, హనుమకొండ కలెక్టరేట్‌ మహిళా శక్తి …

సీఎం రేవంత్‌ పర్యటన రేపటికి వాయిదా

సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్‌ నగర పర్యటన శనివారానికి వాయిదా పడింది. శుక్రవారం వివిధ అభివృద్ధి పనుల పరిశీలన, సమీక్ష నిర్వహించాల్సి ఉండగా ఆ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
టూర్‌ షెడ్యూల్‌ కూడా ఖరారు కాగా, చివరి నిమిషంలో వాయిదా పడింది.

తొలుత విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం.. వరంగల్‌ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు, మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ పరిశీలన, హనుమకొండ కలెక్టరేట్‌ మహిళా శక్తి క్యాంటీన్‌ ప్రారంభం, జీడబ్ల్యూఎంసీ పరిధిలోని అభివృద్ధి పనులు, సమస్యలపై సమీక్ష నిర్వహించాల్సి ఉంది. ఈ కార్యక్రమాలన్నీ ఈ నెల 29కి వాయిదా పడ్డాయి.

పార్కులో కలెక్టర్‌, సీపీ ఏర్పాట్ల పరిశీలన

గీసుగొండ : సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో గురువారం సాయంత్రం కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును వరంగల్‌ కలెక్టర్‌ సత్య శారదాదేవి, సీపీ అంబర్‌ కిశోర్‌ఝా, సీఎం వ్యక్తిగత భద్రతా సిబ్బందితో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా హెలీప్యాడ్‌తో పాటు ఫొటో ఎగ్జిబిషన్‌ గ్యాలరీ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

వారి వెంట అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, ఆర్డీవో దత్తు, టీఎస్‌ఐఐసీ జోనల్‌ మేనేజర్‌ సంతోష్‌కుమార్‌, డీసీపీ రవీందర్‌, డీఎంహెచ్‌వో వెంకటరమణ, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

Updated On 28 Jun 2024 11:39 AM IST
cknews1122

cknews1122

Next Story