గాలివానకు కూలిపోయిన విమానం పైకప్పు
Web desc : దేశరాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం, ఈదురుగాలులు కారణంగా ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ లోని టర్మినల్ 1 దగ్గర పై కప్పు కూలిపోయింది.
ఈ ప్రమాదం శుక్రవారం తెల్లవారుజామున 5గంటలకు జరిగింది. ఐరన్ ఫ్రేమ్ తో ఉండే షెడ్ కూలిపోవడంతో దానికింద ఉన్న ముగ్గిరికి గాయాలు అయ్యాయి.
సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీస్ కూలిపోయిన టెంట్ కింద చిక్కుకున్నవారిని రక్షించారు. గాయపడ్డవారిని హాస్పిటల్ కు తరలించారు.
గత 24 గంటల నుంచి భారీ వర్షం కారణంగా ఢిల్లీలో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు చేరింది.
శుక్రవారం ఉదయం 5.30 గంటల వరకు సఫ్దర్జంగ్లో 153.7 మిల్లీమీటర్లు, పాలం విమానాశ్రయంలో 93 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.