మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి…
శోకసంద్రంలో పార్టీ నాయకులు
తెలంగాణ పాలిటిక్స్‌లో మరో విషాదం చోటు చేసుకుంది.ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ (62) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో రమేష్ రాథోడ్‌ను ఆస్పత్రికి తరలించారు.
ఉట్నూర్‌లోని ఆయన నివాసంలో రమేష్ రాథోడ్ అస్వస్థతకు గురికాగా చికిత్స అందిస్తున్న సమయంలో కోమాలోకి వెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా రమేష్ రాథోడ్ కన్నుమూశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన ఆయన పాలిటిక్స్‌లో సీనియర్ నాయకులుగా పేరొందారు. రమేష్ రాథోడ్ మృతి పట్ల ఆయన అభిమానులు, పలువురు పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కాగా, శనివారం తెల్లవారుజామున కాంగ్రెస్ సీనియర్ నేత డీ. శ్రీనివాస్ మృతి చెందగా గంటల వ్యవధిలోనే మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ చనిపోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.