నిరుపేద కుటుంబానికి ‘కొండంత అండ’. –ఎస్సై మధు చేతుల మీదుగా వితరణ –మరోసారి దాతృత్వం చాటిన చేతన మీ సేవ ‘రంజిత్‌’ సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్), జూన్ 29, భద్రాచలంలోని సుభాష్‌ నగర్‌ కాలనీకు చెందిన ఓ నిరుపేద కుటుంబానికి కొండంత అండగా నిలిచాడు చేతనా మీ సేవా నిర్వహకులు రంజిత్‌ నాయక్‌. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సుభాష్‌ నగర్‌ కాలనీకు చెందిన బానోత్‌ …

నిరుపేద కుటుంబానికి ‘కొండంత అండ’.

–ఎస్సై మధు చేతుల మీదుగా వితరణ

–మరోసారి దాతృత్వం చాటిన చేతన మీ సేవ ‘రంజిత్‌’

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

జూన్ 29,

భద్రాచలంలోని సుభాష్‌ నగర్‌ కాలనీకు చెందిన ఓ నిరుపేద కుటుంబానికి కొండంత అండగా నిలిచాడు చేతనా మీ సేవా నిర్వహకులు రంజిత్‌ నాయక్‌. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సుభాష్‌ నగర్‌ కాలనీకు చెందిన బానోత్‌ సుభద్రకు భర్త మరణించగా, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో ఒక కుమారుడు రాకేష్‌ చదువును మానివేయగా, కుమార్తె చిట్టి మానసిక వికరాంగురా లు. కాగా సుభద్రకు గుండెజబ్బుతో పాటు వెన్నుపూసకు దెబ్బ తినటంతో ఇంటికే పరిమితమయింది.

తినటానికి కనీసం తిండి లేక ఇల్లు గడవని స్థితిలో ఉండి తీవ్ర ఇబ్బందులు పడుతుంది. సహాయాని కై పట్టణంలోని చేతన మీ సేవా నిర్వహకులు రంజిత్‌ నాయక్‌ను స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకురాలు సీతామహలక్ష్మీతో సుభద్ర ఆశ్రయించి కన్నీళ్లు పెట్టుకొని గోడును వెళ్లబోసుకుంది.

చలించిన రంజిత్‌ నాయక్‌ వెంటనే బియ్యం, నిత్యవసర సామాగ్రి, సరిపడ కూరగాయలు, ముగ్గురు పిల్లలకు తొమ్మిది జతల బట్టలను తీసుకొని ట్రాఫిక్‌ ఎస్సై మధు చేతుల మీదుగా వారి ఇంటి వద్దకు వెళ్లి ఇప్పించారు. అదేవిధంగా రాకేష్‌ చదువు మానేశాడని తెలియటంతో వెంటనే ఆ విద్యార్ధికి కావాల్సిన నోట్‌ బుక్స్, యూనిఫాంలను ఇచ్చి ప్రభుత్వ హైస్కూల్‌కు స్వయంగా తీసుకొని వెళ్లి తిరిగి పాఠశాలలో చేర్పించాడు.

ఈ సందర్భంగా ఎస్సై మధు మాట్లాడుతూ… నిరుపేద మహిళ ఆర్ధిక ఇబ్బందులతో ఉండటం తనను కలిచివేసిందని అన్నారు.ఇటువంటి కుటుంబానికి అండగా నిలిచిన రంజిత్‌ అభినందనీయుడని కొనియాడారు. ఈ కుటుంబానికి తగిన సహాయం చేసేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు.

దీంతో అక్కడే ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లెక్చరర్‌ మాన్‌సింగ్‌ ఆర్ధిక సాయంను అందచేశారు. ఈ కార్యక్రమంలో మధర్‌థెరిస్సా ఛారిటబుల్‌ ట్రస్టు నిర్వహకులు కొప్పుల మురళీ, ఎస్‌ కే షరీప్, తదితరులు పాల్గొన్నారు.

Updated On 29 Jun 2024 7:49 PM IST
cknews1122

cknews1122

Next Story