పరిశ్రమల శాఖ సంబంధిత అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి సౌత్ గ్లాస్ కంపెనీ యజమాని శైలేష్ అగర్వాల్ పై హత్య నేరం నమోదు చేయండి మృతుల కుటుంబాలకు నష్టపరిహారం కంపెనీ యాజమాన్యమే భరించాలి చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సౌత్‌ గ్లాస్‌ ప్రైవేటు కంపెనీలో జరిగిన పేలుడుపై బీఆర్‌ఎస్‌ నేత, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్లాస్‌ పరిశ్రమలో జరిగిన పేలుడులో …

పరిశ్రమల శాఖ సంబంధిత అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి

సౌత్ గ్లాస్ కంపెనీ యజమాని శైలేష్ అగర్వాల్ పై హత్య నేరం నమోదు చేయండి

మృతుల కుటుంబాలకు నష్టపరిహారం కంపెనీ యాజమాన్యమే భరించాలి

చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

సౌత్‌ గ్లాస్‌ ప్రైవేటు కంపెనీలో జరిగిన పేలుడుపై బీఆర్‌ఎస్‌ నేత, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్లాస్‌ పరిశ్రమలో జరిగిన పేలుడులో ఐదుగురు వలస కార్మికులు మరణించడం అత్యంత బాధాకరమని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. శనివారం పరక్ నగర్ మండలం చింతగూడ గ్రామపంచాయతీ లోని సౌత్ గ్లాస్ అద్దాల పరిశ్రమను పరిశీలించారు. అంతకుముందు గాయపడ్డ కార్మికులను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో పరామర్శించారు

పరిశ్రమలో జరిగిన ప్రమాదం సంఘటన చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుందని ఎమ్మెల్సీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇప్పటికైనా అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌ను తక్షణమే నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు.

చనిపోయిన బాధిత మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వాలని అదేవిధంగా కంపెనీ యాజమాన్యం అదనంగా నష్టపరిహారం చెల్లించాలని నవీన్ రెడ్డి డిమాండ్ చేశారు.ఈ సంఘటనకు కారణమైన కంపెనీ యాజమాన్యం శైలేష్ అగర్వాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ముందుగా అతనిపై హత్య నేరం కింద కేసు నమోదు చేయాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఏ పరిశ్రమ యజమానినీ ప్రభుత్వం వదలకూడదని హెచ్చరించారు. సంఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందించే నాయకులు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు ఆ తర్వాత కూడా పరిశ్రమల తీరుపై నిఘా పెట్టాలని సూచించారు. ఈ సంఘటనలో న్యాయం జరగకపోతే న్యాయపోరాటం చేస్తానని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.

ప్రమాదంలో బాధిత, మృతుల కుటుంబాలకు బీఆర్‌ఎస్‌ నేత నవీన్ కుమార్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఫ్యాక్టరీల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఐదు మంది కార్మికులు చనిపోవడం అత్యంత దారుణమని అన్నారు.

పరిశ్రమలపై పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుందని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు నియోజకవర్గంలో పారిశ్రామిక వాడ ఎంతో గొప్పగా ఉందని దాదాపు 300 పై చిలుకు కంపెనీలు ఉన్నాయని, 40 వేల మంది కార్మికులు దాదాపు పనిచేస్తున్నారని ఇందులో ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారని నవీన్ రెడ్డి తెలిపారు.

స్థానిక సౌత్‌ గ్లాస్‌ ప్రైవేటు కంపెనీలోని కంప్రెషర్‌ పేలడంతో ఐదుగురు దుర్మరణం చెందారని గాజు పరిశ్రమ కావడంతో కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయని ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారని విచారం వ్యక్తం చేశారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనీ పేలుడు సమయంలో 150 మంది కార్మికులు పనిచేస్తున్నారనీ కాగా, ఈ ప్రమాదంపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించి మృతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మౌనిక హరికృష్ణ గౌడ్ చక్కటి ప్రభాకర్ సింగల్ విండో డైరెక్టర్, టిఆర్ఎస్ నాయకులు యాదయ్య సంతోష్ అంజయ్య రమేష్ మాసయ్య గౌడ్ మామిడిపల్లి ఎంపీటీసీ రవీందర్ మాధవి, గుట్ట రాజు మధు సుధీర్ తదితరులు ఉన్నారు..

Updated On 29 Jun 2024 9:54 PM IST
cknews1122

cknews1122

Next Story