అత్యాధునిక సాంకేతికతతో స్తంభాద్రి హాస్పిటల్ ప్రారంభం
సౌకర్యాలు అన్ని ఒకేచోట
సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం
అత్యాధునిక సాంకేతికత, అత్యుత్తమ నిపుణుల వైద్య బృందం తో ప్రజానీకానికి నాణ్యతతో కూడిన మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా ఖమ్మం నగరంలో స్తంభాద్రి హాస్పిటల్ ను నెలకొలిపారు.
హాస్పిటల్ ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలకు అందుబాటులో సామాన్య, మధ్యతరగతి ప్రజానీకానికి అత్యాధునిక సౌకర్యాలతో, మెట్రోపాలిటన్ నగరాలకు ధీటుగా స్తంభాద్రి యాజమాన్యం అడ్వాన్స్ వైద్యాన్ని ఖమ్మం లోనే అందుబాటులోకి తీసుకు రావడం సంతోషాదయకమన్నారు.
హాస్పిటల్ లో ఒకేచోట దశబ్దకాలం అనుభవం కలిగిన ఐదు రకాల ప్రత్యేక స్పెషలైజేషన్ వైద్య బృందంచే సేవలు కలిగి ఉండటం హర్షదాయకమని అన్నారు.
ప్రజలకు నాణ్యతతో కూడిన వైద్య సేవలు అందిస్తూనే నిరుపేదలకు రాయితీ విధానాన్ని అందిస్తూ వారి మన్ననలను పొందాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం స్తంభాద్రి హాస్పిటల్ వైద్య బృందం న్యూరో సర్జన్ డాక్టర్ గట్టినేని సురేష్, ఆర్థో డాక్టర్ డాక్టర్ మేదరమెట్ల అనిల్ కుమార్, యురాలజిస్టు డాక్టర్ గుమ్మడి రాఘవేంద్ర, కార్డియాలజిస్టు డాక్టర్ పేర్ల హర్షతేజ, ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ డొగిపర్తి కృష్ణ సుమంత్ మీడియా తో మాట్లాడారు.
సువిశాలమైన స్థలంలో130 పడకలు, ఐదుగురు స్పెషలిస్టుల డాక్టర్ల పర్యవేక్షణ లో స్తంభాద్రి హాస్పిటల్ ను నెలకొల్పామన్నారు.తమ హాస్పిటల్ లో అత్యాధునిక క్యాథల్యాబ్, సిటీ స్కాన్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు వివరించారు.
తమ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
కార్యక్రమంలో MLC తాతా మధు, మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్ కమర్తపు మురళి, వివిధ రాజకీయ పక్షాల నాయకులు పువ్వాడ నాగేశ్వరావు, పోటు రంగారావు, భాగం హేమంత రావు, పొతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరావు, విక్రమ్, కొండపల్లి శ్రీధర్ రెడ్డి, గల్లా సత్యనారాయణ, స్థానిక కార్పొరేటర్ క్లెమెంట్, ప్రముఖులు స్పర్శ భాస్కర్, డాక్టర్ అప్పారావు, తాళ్లూరి సృజన్ కుమార్, నున్నా రమేష్, పోటు కళావతి, మేదరమెట్ల స్వరూప రాణి, నున్నా కృష్ణ ప్రియ, ప్రతిభ రెడ్డి, సాగర్ తదితరులు పాల్గొన్నారు.