భారీగా గంజాయి పట్టివేత…. వ్యక్తి అరెస్ట్
నిషేదిత గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిరూ. 4 లక్షల విలువ గల గంజాయిని స్వాధీన పరుచుకున్నట్లుగా ఏటూరునాగారం ఏఏస్పీ మహేష్ బాబా సాహెబ్ గీతే తెలిపారు.
పోలిసులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా ఏస్పీ పి.శబరిష్ ఆదేశాల మేరకు శుక్రవారం రోజున మధ్యహ్నం 1ః30 గం.. సమయంలో ఏటూరునాగారం ఏస్సై తాజోద్దిన్ ఏటూరునాగారం చెక్ పోస్టు వద్ద వాహన తనికీలు నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి పోలిసులను చూసి పారిపోతుండగా అనుమానంతో పోలిసులు అతని పట్టుకుని చూడగా అతని వద్ద 16 కేజీల గంజాయి పట్టుబడిందని, పట్టుకున్న గంజాయి విలువ 4 లక్షల వరకు ఉంటుందని ఏటూరునాగారం ఏఏస్పీ తెలిపారు.
కాగా నిషేదిత గంజాయి తరలిస్తూ పట్టుబడిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలంలోని గూండాల కాలనీ గ్రామానికి చెందిన పిల్లం వీర్రాజు(29), తండ్రి సోమరాజు,వృత్తిరీత్యా పెయింటర్ గా పని చేస్తున్నట్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు.పట్టుకున్న వ్యక్తిని ఏఏస్పీ కార్యాలయం ఆవరణలో శనివారం రోజున నిందితుడిని ఆరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఏఏస్పీ మహేష్ బాబాసాహెబ్ గీతే మాట్లాడుతూ.. గంజాయి అక్రమంగా తరలిస్తున్న రవాణాను నిరోధించేందుకు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్, ఆదేశాల మేరకు ఏటూరు నాగారం సర్కిల్ ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్ఐ తాజుద్దీన్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక నిఘాతో గంజాయి రవాణాను సమర్థవంతంగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై ఎస్కే తాజుద్దీన్, హెడ్ కానిస్టేబుల్ రామారావు, పోలీసులు గోపి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.