అతిథి అధ్యాప‌కుల నియామ‌కానికి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం… సి కే న్యూస్ (సంపత్) జూన్ 30 ఆలేరులోని స్థానిక ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల‌లోని అతిథి అధ్యాప‌కుల నియామ‌కానికి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ట్లు క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ బి ల‌క్ష్మ‌ణ్‌నాయ‌క్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. క‌ళాశాల విద్యాక‌మీష‌న‌ర్ ఆదేశాల మేర‌కు 2024-2025 విద్యాసంవ‌త్స‌రానికి గానూ మాథ్స్, డైరీ సైన్స్, కంప్యూట‌ర్ సైన్స్, హిస్ట‌రీ స‌బ్జెక్ట్‌ల‌ విభాగాల్లో ఖాళీ ఉన్న‌ట్లు తెలియ‌జేశారు. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల‌కు సంబంధిత పీజీ స‌బ్జెక్ట్‌లో 55శాతం బీసీ, …

అతిథి అధ్యాప‌కుల నియామ‌కానికి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం…

సి కే న్యూస్ (సంపత్) జూన్ 30

ఆలేరులోని స్థానిక ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల‌లోని అతిథి అధ్యాప‌కుల నియామ‌కానికి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ట్లు క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ బి ల‌క్ష్మ‌ణ్‌నాయ‌క్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. క‌ళాశాల విద్యాక‌మీష‌న‌ర్ ఆదేశాల మేర‌కు 2024-2025 విద్యాసంవ‌త్స‌రానికి గానూ మాథ్స్, డైరీ సైన్స్, కంప్యూట‌ర్ సైన్స్, హిస్ట‌రీ స‌బ్జెక్ట్‌ల‌ విభాగాల్లో ఖాళీ ఉన్న‌ట్లు తెలియ‌జేశారు.

ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల‌కు సంబంధిత పీజీ స‌బ్జెక్ట్‌లో 55శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు 50 శాతం మార్కులు క‌లిగి ఉండాల‌ని, మ‌రియు నెట్, సెట్, పిహెచ్‌డీ క‌లిగిన అభ్య‌ర్థుల‌కు మొద‌టి ప్రాధాన్యం ఉంటుంద‌ని అన్నారు. అర్హ‌త ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు జూలై 3వ తేదీన సాయంత్రం 4.30 గంట‌ల లోపు క‌ళాశాల కార్యాల‌యంలో ద‌ర‌ఖాస్తులు అందించాల‌ని పూర్తి వివ‌రాల‌కు 9440786978 గ‌ల నెంబ‌ర్‌కు సంప్ర‌దించ‌గ‌ల‌రు.

ఇట్టి పోస్టుల సెల‌క్షన్స్ కొర‌కు ఇంట‌ర్వ్యూలు ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల రామ‌న్న‌పేట‌లో జ‌రుగును. ఇంట‌ర్వ్యూలు జ‌రుగు తేదీని ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు త‌దుప‌రి తేదీల‌ను తెలియ‌జేయ‌డం జ‌రుగుతుంది.

Updated On 30 Jun 2024 7:52 PM IST
cknews1122

cknews1122

Next Story