రోబోలా నడుచుకుంటూ వచ్చి.. ప్రపంచకప్‌ ట్రోఫీని అందుకున్న రోహిత్‌ శర్మ! దక్షిణాఫ్రికాపై అద్భుత విజయాన్ని నమోదు చేసిన భారత్.. టీ20 ప్రపంచకప్‌ను అందుకుంది. ఫైనల్లో గెలవడానికి దక్షిణాఫ్రికాకు ఎక్కువ అవకాశాలు ఉన్న స్థితిలో అద్భుతమే చేసి విశ్వవిజేతగా నిలిచింది. ఓటమి కోరల్లో నుంచి నమ్మశక్యం కాని రీతిలో పుంజుకున్న రోహిత్ సేన.. దక్షిణాఫ్రికా నుంచి విజయాన్ని లాగేసుకుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసిన ఫైనల్ పోరులో 7 పరుగుల తేడాతో గెలిచి.. 13 ఏళ్ల ప్రపంచకప్, …

రోబోలా నడుచుకుంటూ వచ్చి.. ప్రపంచకప్‌ ట్రోఫీని అందుకున్న రోహిత్‌ శర్మ!

దక్షిణాఫ్రికాపై అద్భుత విజయాన్ని నమోదు చేసిన భారత్.. టీ20 ప్రపంచకప్‌ను అందుకుంది. ఫైనల్లో గెలవడానికి దక్షిణాఫ్రికాకు ఎక్కువ అవకాశాలు ఉన్న స్థితిలో అద్భుతమే చేసి విశ్వవిజేతగా నిలిచింది.

ఓటమి కోరల్లో నుంచి నమ్మశక్యం కాని రీతిలో పుంజుకున్న రోహిత్ సేన.. దక్షిణాఫ్రికా నుంచి విజయాన్ని లాగేసుకుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసిన ఫైనల్ పోరులో 7 పరుగుల తేడాతో గెలిచి.. 13 ఏళ్ల ప్రపంచకప్, 11 ఏళ్ల ఐసీసీ టోర్నీ నిరీక్షణకు తెరదించింది.

భారత్‌ విశ్వవిజేతగా నిలిచిన వేళ టీమిండియా ఆటగాళ్ల ఆనందానికి అడ్డే లేకుండా పోయింది. మైదానంలో డాన్సులు చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.

ఇక కెప్టెన్‌ రోహిత్ శర్మ సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ రోబోలా నడుచుకుంటూ వచ్చి.. ప్రపంచకప్‌ ట్రోఫీని అందుకున్నాడు. రోహిత్‌ నడుచుకుంటూ వస్తుండగా.. ప్లేయర్స్ అందరూ చప్పట్లు కొట్టారు.

బీసీసీఐ సెక్రటరీ జై షా ట్రోఫీని రోహిత్‌కు అందించాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్‌ రోబోలా నడిచిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.

Updated On 30 Jun 2024 12:17 PM IST
cknews1122

cknews1122

Next Story