ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్న ధర్మసాగర్ దగా కోరులు సీకే న్యూస్ ధర్మసాగర్ మండలం హనుమకొండ జిల్లా ప్రతినిధి కమలాకర్ జులై 1 ధర్మసాగరము గ్రామ శివారులో దేవాదుల పైపులైను సమీపంలో ప్రభుత్వం భూమి సర్వే నం.427/ 1 లో ఎ.00-12 గు, 428/1 లో ఎ.00-01 గు, పోరంబోకు భూమి సరే& వనం. 429 లో ఎ.02-15 గు. భూమి కలదు,ఇట్టి మొత్తము భూమి ఎ.02-28 గు. ప్రభుత్వ భూమిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు జె.సి.బి.ని …

ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్న ధర్మసాగర్ దగా కోరులు

సీకే న్యూస్ ధర్మసాగర్ మండలం హనుమకొండ జిల్లా ప్రతినిధి కమలాకర్ జులై 1

ధర్మసాగరము గ్రామ శివారులో దేవాదుల పైపులైను సమీపంలో ప్రభుత్వం భూమి సర్వే నం.427/ 1 లో ఎ.00-12 గు, 428/1 లో ఎ.00-01 గు, పోరంబోకు భూమి సరే& వనం. 429 లో ఎ.02-15 గు. భూమి కలదు,ఇట్టి మొత్తము భూమి ఎ.02-28 గు. ప్రభుత్వ భూమిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు జె.సి.బి.ని ఉపయోగించి చదును చేసినారు. ఇట్టి భూమిని అన్యాక్రాంతం చేయాలని చూస్తున్నారు. కొంత భూమిని కబ్జాకూడా చేసినారు.

ధర్మసాగర్ తాసిల్దార్ తమరు దయతలంచి ఇట్టి ప్రభుత్వం భూమి అన్యాక్రాంతం కాకుండా వెంటనే పైన తెలిపిన సర్వే సం.లోని భూమిని సర్వే చేయించి హద్దులు ఏర్పాటుచెయ్యగలరని మనవి. ఇట్టి భూమిని కబ్జాచేసిన వారిపైన తగిన చర్య తీసుకుని ఉపయోగించిన వాహనాలను స్వాధీనపరుచుకొని చట్టపరమైన కఠిచర్యలు తీసుకోగలరని కోరుతున్నాము.

గంగారపు శ్రీనివాస్ ఎంఆర్పిఎస్ నాయకులు. బొడ్డు శాంతి సాగర్ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ఎమ్మార్పీఎస్ మండల నాయకులు ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ నాయకులు, ప్రజలు ప్రభుత్వ భూమిని కాపాడాలని ధర్మసాగర్ తాసిల్దార్ కి వినతిపత్రం అందజేసి కోరుకుంటున్నారు.

Updated On 1 July 2024 7:20 PM IST
cknews1122

cknews1122

Next Story