సెక్రటేరియట్ లో మంత్రి కోమటిరెడ్డి ఆకస్మిక తనిఖీ
సెక్రటేరియట్ లో మంత్రి కోమటిరెడ్డి ఆకస్మిక తనిఖీ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని సెక్రటేరియట్ లో ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి,ఆకస్మికంగా ఆర్ అండ్ బీ సెక్షన్‌లో తనిఖీలు చేశారు. సెక్రటేరియట్‌లో ఉద్యోగుల పనితీరు గురించి తెలుసు కోడానికి వెళ్లిన మంత్రి.. అక్కడ పరిస్థితి చూసి నిర్ఘాంతపోయారు. ఆర్ అండ్ బీ సెక్షన్‌లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఆయనకు.. ఖాళీ కుర్చీలే దర్శనమి చ్చాయి. సమయం దాటిపోయినా చాలా మంది ఉద్యోగులు ఆఫీసుకు రాకపోవడంతో మంత్రి …
![సెక్రటేరియట్ లో మంత్రి కోమటిరెడ్డి ఆకస్మిక తనిఖీ సెక్రటేరియట్ లో మంత్రి కోమటిరెడ్డి ఆకస్మిక తనిఖీ](https://cknewstv.in/wp-content/uploads/2024/07/IMG-20240703-WA0010.jpg)
సెక్రటేరియట్ లో మంత్రి కోమటిరెడ్డి ఆకస్మిక తనిఖీ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని సెక్రటేరియట్ లో ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి,ఆకస్మికంగా ఆర్ అండ్ బీ సెక్షన్‌లో తనిఖీలు చేశారు.
సెక్రటేరియట్‌లో ఉద్యోగుల పనితీరు గురించి తెలుసు కోడానికి వెళ్లిన మంత్రి.. అక్కడ పరిస్థితి చూసి నిర్ఘాంతపోయారు. ఆర్ అండ్ బీ సెక్షన్‌లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఆయనకు.. ఖాళీ కుర్చీలే దర్శనమి చ్చాయి.
సమయం దాటిపోయినా చాలా మంది ఉద్యోగులు ఆఫీసుకు రాకపోవడంతో మంత్రి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
![](https://cknewstv.in/wp-content/uploads/2024/06/IMG-20240511-WA0049-791x1024-1.jpg)
సాధారణంగా ఉద్యోగులు ఉదయం 10 గంటలకు కార్యాలయాలకు హాజరు కావాల్సి ఉంటుంది. కానీ, సెక్రటేరియట్ ఉద్యోగులు మాత్రం 11 గంటలైనా రాకపోవడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు.
11 అయినా రాలేదు.. మళ్లీ 6గంటలకు వెళ్లిపోతారు.. మధ్యలో ఆఫ్ అంటూ మంత్రి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతోపాటు పలు వివ రాలను మంత్రి కోమటిరెడ్డి అడిగి తెలుసుకున్నారు..
కొన్ని విషయాలపై అధికా రులు స్పందించకపోవడంతో మీ వివరాలు మీకు కూడా తెలియదా అంటూ ఫైర్ అయ్యారు. ఇకపై ఉద్యో గులు సమయపాలన పాటించాలని.. ఇలా అయితే కుదరదంటూ వార్నింగ్ ఇచ్చారు…
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)