భూమిని ఆక్రమించుకున్నారని రైతు ఆత్మహత్యాయత్నం ఖమ్మం : తన భూమిని ఆక్రమించుకొని ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం ఉసిరికాయపల్లిలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గ్రామానికి చెందిన రైతు పచ్చిపాల భద్రయ్యకు ఆల్యాతండా సమీపంలో ఎకరంన్నర భూమి ఉంది. దీన్ని ఆర్టీఐ మాజీ కమిషనర్ శంకర్​నాయక్ ​అక్రమంగా పట్టా చేయించుకుని ఆక్రమించుకున్నాడని ఆరోపించాడు. ఈ క్రమంలో సదరు భూమిలో ఆర్టీఐ మాజీ కమిషనర్​ ట్రాక్టర్​తో దున్నిస్తుండగా భద్రయ్య అడ్డుకున్నాడు. …

భూమిని ఆక్రమించుకున్నారని రైతు ఆత్మహత్యాయత్నం

ఖమ్మం : తన భూమిని ఆక్రమించుకొని ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం ఉసిరికాయపల్లిలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

గ్రామానికి చెందిన రైతు పచ్చిపాల భద్రయ్యకు ఆల్యాతండా సమీపంలో ఎకరంన్నర భూమి ఉంది. దీన్ని ఆర్టీఐ మాజీ కమిషనర్ శంకర్​నాయక్ ​అక్రమంగా పట్టా చేయించుకుని ఆక్రమించుకున్నాడని ఆరోపించాడు.

ఈ క్రమంలో సదరు భూమిలో ఆర్టీఐ మాజీ కమిషనర్​ ట్రాక్టర్​తో దున్నిస్తుండగా భద్రయ్య అడ్డుకున్నాడు. వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

అక్కడే పడిపోయిన భద్రయ్యను ఇల్లందు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకువెళ్లారు.

సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబంతో మాట్లాడారు. విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. భార్య పిర్యాదు తో కేసు నమోదు..

Updated On 5 July 2024 10:21 AM IST
cknews1122

cknews1122

Next Story