మహిళపై దాడి చేసి విధ్వంసం సృష్టించిన పాస్టర్
సిసి కెమెరాలు పగులగొట్టి తల్లి కొడుకులను చితకబాదిన దైన్యం
కేసులు వాపసు తీసుకోకపోతే చంపుతామని బెదిరింపులు
ఇంట్లో ఎవరూ లేని సమయంలో 50 మంది అనుచరులతో దౌర్జన్యం
మహిళ చేతులు వెనక్కి విరిచి కట్టి డబ్బు బంగారం లూటీ
సిసి కెమెరాల్లో రికార్డయిన మడి వెంకటేశ్వర్లు నిజ స్వరూపం
భద్రాద్రి కొత్తగూడెం (సికే న్యూస్) జులై 06: రాజాపురం భూ వివాదంలో బాధితులైన ఊకె రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి వేధింపులు తీవ్రమయ్యాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పాస్టర్ మడి వెంకటేశ్వర్లు అతని భార్య బుల్లెమ్మ కొడుకు మడి వినోద్ నమ్మిన బంటు సోయం సునీల్ లు కలిసి వేరే వేరే గ్రామాలకు చెందిన సుమారు 50 మందితో ఊకె రాజేంద్ర ప్రసాద్ ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు.
ఆ సమయంలో ఊకె రాజేంద్ర ప్రసాద్ భార్య ఊకె లక్ష్మి కొడుకు పౌలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. మంది మార్భలంతో అక్రమంగా ప్రవేశించడమే కాకుండా తల్లి కొడుకులను విచక్షణ రహితంగా కొట్టారని బాధితులు విలపిస్తున్నారు.
ఊకె లక్ష్మిని చేతులు వెనక్కి విరిచి కట్టి మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు లాక్కున్నారని ఇంట్లోకి ప్రవేశించి పన్నెండు లక్షల రూపాయల డబ్బులు తన కూతురి బంగారు గొలుసు ఉంగరాలు లూటీ చేసి అడ్డు వచ్చిన తన కొడుకుని కిందపడేసి కాళ్ళతో ఇష్టం వచ్చినట్లు తొక్కుతూ కొట్టారని బాదితులు చెప్పారు.
సిసి కెమెరాలు ధ్వంసం చేస్తూ వీధి రౌడీలా వ్యవహరిస్తున్న పాస్టర్
జగన్నాధపురం గ్రామ పరిధిలో పెట్రోలు బంకు నిర్మాణం కొరకు పీసా గ్రామ సభ నిర్వహించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. దీనికోసం గ్రామంలో ప్రజలందరూ సమావేశానికి వెళ్లిన సమయంలో
ఉదయం సుమారు పదకొండున్నర గంటల ప్రాంతంలో మడి వెంకటేశ్వర్లు ఎలీషా మరియు అతని కుమారుడు మడి వినోద్ అలియాస్ డేవిడ్ సన్ మడి బుల్లెమ్మ సోయం సునీల్ వగ్గేలా కృష్ణయ్య వగ్గేల స్వర్ణ కారం ధర్ములు మరియు వారి వెంట దాదాపు 60 మందికి పైగా అనుచరులతో ఊకె రాజేంద్ర ప్రసాద్ కుటుంబం నివాసానికి హఠాత్తుగా కర్రలు మారణాయుధాలతో ప్రవేశించి చంపేస్తాము ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని బెదిరిస్తూ మొదట సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. వారి వద్ద ఉన్న కర్రలు గొడ్డళ్లు గుణపాలు రొకలితో దాడి చేస్తూ ఇంటిని భూమిని ఖాళీ చేసి వెళ్లకపోతే చంపేస్తామని బెదిరించారు.
అక్రమంగా నిర్బంధించి కత్తులు గొడ్డళ్లు ఇతర మారణ ఆయుధాలు గన్ను చూపిస్తూ కుటుంబాన్ని అందర్నీ చంపేస్తామని బెదిరించారు. ఆ సమయంలో ఏం చేయాలో అర్ధం కాని ఊకె లక్ష్మి తన అన్నయ్యకు ఫోన్ ద్వారా సమాచారాన్ని ఇచ్చింది. అతను వెంటనే 100 కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ విషయాన్ని గమనించిన మడి వెంకటేశ్వర్లు మడి వినోద్ సోయం సునిల్ వగ్గేలా కృష్ణయ్య మడి బుల్లెమ్మ వగ్గేల స్వర్ణ కారం ధర్ములు నన్ను ఒక మహిళ అనే జాలి కూడా లేకుండా విచక్షణా రహితంగా కొడుతూ అడ్డు వచ్చిన కోడుకుని కింద పడవేసి కాళ్ళతో విచక్షణా రహితంగా తొక్కుతూ తీవ్రంగా కొట్టారు.
మడి వినోద్ మహిల్ చేతులు వెనక్కి విరిచి పట్టుకోగా మడి వెంకటేశ్వర్లు మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును లాక్కుని ఇంట్లో ఉన్న 12లక్షల 40 వేల నగదు కూతురికి చెందిన రెండు తులాల బంగారు చైన్ మరియు సుమారు తులంన్నర ఉంగరాలు మూడు లూటీ చేసుకుని పోయారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి రెక్కీ కట్టి మరి తల్లి కొడుకులు మాత్రమే ఉన్న సమయంలో మహిళను ఆమె కొడుకు ముందే బట్టలు చింపి కొట్టి చితక బాదారు.
రేప్ చేస్తామని మడి వెంకటేశ్వర్లు మడి వినోద్ సోయం సునీల్ లు కాళ్ళు చేతులు పట్టుని లాక్కెళ్ళడానికి తీవ్రంగా ప్రయత్నం చేసినా మహిళ తీవ్రంగా ప్రతిగటించేసరికి మహిళా శరీర భాగాలను చేతులతో పట్టుకొంటూ భయంకరంగా సభ్య సమాజం తల దించుకునేలా ప్రవర్తించారని బాధితురాలు ఊకె లక్ష్మి ఏడుస్తూ జరిగిన దారుణాన్ని వివరించింది.
బాధితులకు అందని పోలీసుల సహాయం:
ఈ కేసులో ఇప్పటివరకు బాధితులకు పోలీసుల నుండి ఎలాంటి సహాయం దొరకలేదు. హైకోర్టులో స్టే తెచ్చుకున్నా స్థానిక పోలీసులు బాధితులను వారి ఇంట్లోనుండి ఖాళీ చేయించేందుకు ప్రయత్నం చేయడం విమర్శలకు దారితీసింది.
కోర్టు పిటిషనర్ కు ఇచ్చిన స్టే ఆర్థర్ రెస్పాండెంట్స్ కు కూడా వర్తిస్తుందని అడ్డదిడ్డంగా మాట్లాడారు. ఇప్పుడు బాధితులు వారికి అనుకూలంగా ఇచ్చిన కోర్టు తీర్పును చూపించినా కూడా మళ్ళీ ఇలాంటి వాదనలే వినిపిస్తున్నారు. పోలీసులు సైతం ఇలాంటి వాదనతో ఏకీభవించి బాధితులను వేధించడం ఏమిటో అర్థం కాని విషయం.
మడి వెంకటేశ్వర్లు తనకు అనుకూలంగా తెచ్చుకున్న మొబైల్ కోర్టు ఆదేశాలను తెలంగాణ ఉన్నత న్యాయస్థానం పక్కన పెట్టినా ఇంకా దానిపై వితండవాదం చేస్తున్నారు ప్రతివాదులు. ప్రెస్ మీట్ పెట్టి మరి హైకోర్టు ఆదేశాలకు వక్ర భాష్యం చెబుతూ న్యాయమే గెలుస్తుందని నిన్నటి వరకు చెప్పి ఈ రోజు హఠాత్తుగా రౌడీలలాగా బాధితులపై విరుచుకుపడ్డారు పాస్టర్ మడి వెంకటేశ్వర్లు అతని అనుచరులు.
బాధితులు డయల్ 100 కి ఫోన్ చేసినా ములకపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు సహాయం చేయకపోగా ఖాళీ చేయాలంటూ బాధితులనే బెదిరించడం పలు అనుమానాలకు తావిస్తుంది. స్థానిక ఎస్సై బదిలీ కావడంతో ఏ ఎస్సై ఫిర్యాదు తీసుకోవడానికి తాత్సారం చేస్తున్నారు.
దీంతో బాధితులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఇంట్లోకి వెళ్లకుండా యాభై మంది వేరే మండలానికి చెందిన వ్యక్తులు కర్రలు పట్టుకుని తిరుగుతున్నారని ప్రాణహాని ఉందని చెప్పినా పోలీసులు కనీసం మానవత్వం లేకుండా రౌడిల్లా వ్యవహరిస్తున్న వారికి వత్తాసు పలకడం బాధితులకు శరాఘాతంలా మారింది.