జులై 10న మండల కేంద్రంలో జరిగే ధర్నాను జయప్రదం చేయండి
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీలం శీను
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) జూలై 08
బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది ఇప్పటివరకు వారి పాలనలో చేసిందేమీ లేదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీలం శీను అన్నారు. మఠంపల్లి మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ గత 10. సంవత్సరాలుగా సాగించిన ప్రైవేటీకరణ విధానాలను ఏగవంతంగా అమలు చేసేందుకు మళ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేస్తామని బిజెపి ప్రభుత్వం ప్రకటించింది బొగ్గు బ్లాకులు వేలానికి పూలుకొనది
ఈపీఎఫ్ సహకాలంలో చెల్లించని యజమానులకు విధించే జరిమానా భారీగా తగ్గించి ది కార్పొరేట్ మతోన్మాదులను ప్రసన్నం చేసుకొని వారికి లాభాలు కట్టబెట్టినందుకు నిర్వర్చంగా ఉంది కేంద్ర బిజెపి విధానాలను నివారించి కార్మికుల హక్కులను కాపాడేందుకు దేశవ్యాప్తంగా కార్మిక పోరాటాలను ఉదృతం చేయాలని సిఐటియు అఖిల భారత కమిటీ నిర్ణయించింది దేశవ్యాప్తంగా జులై 10న జిల్లా మండల కేంద్రాల్లో కార్మికుల కోర్కెల దినం పాటించాలని పిలుపునిచ్చింది ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో జులై 10 నా మండల కేంద్రంలో జరిగే ధర్నాలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్ రన్ మియా తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు మాలోతు బాలు నాయక్ సిఐటియు మండల కార్యదర్శి మైసయ్య శీను జోష్ అంజయ్య నరసింహ తిరుపతయ్య వెన్నయ వీరస్వామి వెంకన్న మాణిక్ రావు దాట్ల వీర బ్రహ్మచారి.తదితరులు పాల్గొన్నారు.