బంజారా సోదర సోదరీమణులందరికీ సీత్ళా భవాని పండుగ శుభాకాంక్షలు —
వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్
జూలూరుపాడు మండల కాంగ్రెస్ అధ్యక్షులు నాయక్
సి కె న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గ బాదావత్తు హాథిరాం నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల కేంద్రం లో జరుపుకుంటున్న శీతల భవాని పండుగకు బంజారా సోదరి సోదరులకు సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు 09-07-2024 మంగళవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా వైరా నియోజకవర్గ బంజారా వాసులందరూ సీత్ళా భవాని పండుగ అత్యంత భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించాలని సూచిస్తూ,సీత్ళా భవాని పండుగ విశేషాన్ని తెలియజేశారు…. సీత్ళా భవాని పండుగ ప్రపంచం మొత్తంలో నివసిస్తున్న లంబాడీలు వారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ.
ఈ పండుగ బంజారా ఔన్నత్యాన్ని చాటుతుంది. ఈ పండుగ పంటపొలాలు సాగుచేసే ప్రారంభంలో ప్రారంభమవుతుంది. దీనిని ఆషాఢ మాసం లో ఒక మంగళవారం జరుపుతారు. ఇది ప్రతీ సంవత్సర మంగళవారం నాడే జరపడం ఆనవాయితి. ఇది లంబాడీల పండుగలలో మొదటిది.
ఈ పండగలో భాగంగా తాండాల సరిహద్దుల్లోని పొలిమేర, కూడలి వద్ద సీత్ల భవానిని ప్రతిష్టిస్తారు. పురుషులంతా డప్పు వాయిద్యాలు వాయిస్తూ కోళ్లు,మేకలతో, మహిళలు, యువతులు బోనాలు ఎత్తుకుని నృత్యాలు చేసుకుంటూ అమ్మవారిని ప్రతిష్టించిన ప్రదేశానికి వెళ్తారు.
కనుక బంజారాలంతా క్రమ పద్ధతిలో సీట్ల భవాని పూజించి సుఖ సంతోషాలతో గడపాలని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ జూలూరుపాడు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మంగీలాల్ నాయక్ వారికి శుభాకాంక్షలు తెలిపారు
ఈ క్రమంలో అందరు కలిసి పాటలు పాడుతారు. సీత్ళా భవానీ దగ్గరకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా గుగ్గిళ్లు (ఘుగ్రీ), పాయసం (లాప్సీ) సమర్పిస్తారు. కోళ్లు, మేకలు బలి ఇచ్చి వాటి పైనుంచి పశువులను దాటిస్తారు.
అలా చేయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండుతాయని బంజారాల నమ్మకం. దేవతను పూజించే క్రమంలో పెద్ద మనిషిని పూజారిగా ఉంచి అతని చేతుల మీదగా కార్యక్రమం నిర్వహిస్తారు.