ఉద్యమ వీరులకు అరుదైన గౌరవం రవీంద్ర భారతి లో సన్మానం పొందిన రావూరి విజయభాస్కర్ మాదిగ సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ( రామయ్య) జూలై 08 దళిత నాయకులు ఉద్యమ వీరులు రావూరి విజయభాస్కర్ కు రవీంద్రభారతిలో అరుదైన గౌరవం దక్కింది. దళితుల జాతి హక్కుల కోసం ఏర్పడిన ఎమ్మార్పీఎస్ ఉద్యమం గత 20 సంవత్సరాలుగా జాతి కొరకు ఉద్యమంలో పనిచేస్తున్న,రఘునాథపాలెం మాదిగ కులంలో పుట్టి గ్రామ స్థాయి నుండి నేడు రాష్ట్ర స్థాయి …

ఉద్యమ వీరులకు అరుదైన గౌరవం

రవీంద్ర భారతి లో సన్మానం పొందిన

రావూరి విజయభాస్కర్ మాదిగ

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ( రామయ్య) జూలై 08

దళిత నాయకులు ఉద్యమ వీరులు రావూరి విజయభాస్కర్ కు రవీంద్రభారతిలో అరుదైన గౌరవం దక్కింది. దళితుల జాతి హక్కుల కోసం ఏర్పడిన ఎమ్మార్పీఎస్ ఉద్యమం గత 20 సంవత్సరాలుగా జాతి కొరకు ఉద్యమంలో పనిచేస్తున్న,రఘునాథపాలెం మాదిగ కులంలో పుట్టి గ్రామ స్థాయి నుండి నేడు రాష్ట్ర స్థాయి వరకు ,అన్న అంటే నేనున్నా అంటూ, నిత్యం ప్రజలలో ఉన్న నేడు రాష్ట్ర ఉపాధ్యక్షులు రావూరి విజయభాస్కర్ కు ఆదివారం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగిన ఎమ్మార్పీఎస్ 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో, రాష్ట్ర కమిటీ ఆయన సేవలను గుర్తించి,

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ ఆధ్వర్యంలో విజయ భాస్కర్ ను ఘనంగా సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో విజయభాస్కర్ మాట్లాడుతూ జాతి కోసం నిరంతరం పాటుపడుతూ ఎన్నో ఉద్యమాలలో దళిత హక్కులపై వారి యొక్క సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూ వారితో మమేకమై ఇప్పటివరకు చేసిన సేవలకు నేటికీ గుర్తింపు వచ్చిందని ఇది నేను ఇంకా బాధ్యతతో మెలిగి మాదిగ జాతి కోసం ముందుకు వెళతానని ఈ యొక్క సన్మానం నాపై బాధ్యతను పెంచిందని నాకు సహకరించిన ప్రతి ఒక్క ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు నాయకులకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని అన్నారు.

Updated On 9 July 2024 9:26 AM IST
cknews1122

cknews1122

Next Story