ఘనంగా దివంగత నేత వైఎస్ జన్మదిన వేడుకలు సంక్షేమ పథకాల సృష్టికర్త వైయస్ అర్ పిఎసిఎస్ చైర్మన్ జవ్వాజి రామచంద్రయ్య సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) జూలై 08 మఠంపల్లి మండలం రఘునాధపాలెం గ్రామంలో మహానేత మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ జవ్వాజి రామచంద్రయ్య మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకుల …

ఘనంగా దివంగత నేత వైఎస్ జన్మదిన వేడుకలు

సంక్షేమ పథకాల సృష్టికర్త వైయస్ అర్

పిఎసిఎస్ చైర్మన్ జవ్వాజి రామచంద్రయ్య

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) జూలై 08

మఠంపల్లి మండలం రఘునాధపాలెం గ్రామంలో మహానేత మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ జవ్వాజి రామచంద్రయ్య మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో కేకును కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఇట్టి కార్యక్రమంలో డిసిసి జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ నిజాం కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు పసుపులేటి జానయ్య మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు మాతంగి జోజి మాజీ ఎంపీటీసీ మేడి సామెల్ మండల మైనార్టీ అధ్యక్షులు ముత్యాలంపాటి నాగుల్ మీరా సార్ మండల మైనార్టీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎండి అక్బర్ గ్రామ మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జాన్ బాబా 12వ వార్డు నెంబరు పల్లెగుంత దస్తగిరి.

8 వ వార్డ్ నంబరు పసుపులేటి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంచు వెంకటసుబ్బయ్య , ఆరే సైదులు , వెన్న చిన్న బద్రారెడ్డి,రెడబోతుల శ్రీనివాస్ రెడ్డి,తోట వెంకటనారాయణ, మైకల్ రమేష్, ఖాజావలి, ఉదయగిరి కళ్యాణ్, అమరవరపు ప్రవీణ్ కుమార్,దొప్ప నరసింహారావు,మాకం నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Updated On 9 July 2024 9:28 AM IST
cknews1122

cknews1122

Next Story