ఇంజక్షన్లు వికటించి: 17 మంది రోగులకు అస్వస్థత అమరావతి : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి 50 పడకల ప్రభు త్వాస్పత్రిలో మంగళవారం రాత్రి ఇంజక్షన్‌లు వికటించడంతో పలువురు రోగులు అస్వస్థతకు గురయ్యారు. నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన రోగులు, బాలింతలు రెండు మూడు రోజులుగా ఆస్పత్రిలో ఉన్నారు. మంగళవారం రాత్రి విధుల్లో ఉన్న వైద్యురాలు జయలక్ష్మి ఆధ్వర్యంలో నర్సులు వీరికి ఇంజక్షన్లు ఇచ్చారు. కాసేపటికే పై అంతస్తులో చికిత్స పొందుతున్న రోగు లు …

ఇంజక్షన్లు వికటించి: 17 మంది రోగులకు అస్వస్థత

అమరావతి : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి 50 పడకల ప్రభు త్వాస్పత్రిలో మంగళవారం రాత్రి ఇంజక్షన్‌లు వికటించడంతో పలువురు రోగులు అస్వస్థతకు గురయ్యారు.

నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన రోగులు, బాలింతలు రెండు మూడు రోజులుగా ఆస్పత్రిలో ఉన్నారు. మంగళవారం రాత్రి విధుల్లో ఉన్న వైద్యురాలు జయలక్ష్మి ఆధ్వర్యంలో నర్సులు వీరికి ఇంజక్షన్లు ఇచ్చారు.

కాసేపటికే పై అంతస్తులో చికిత్స పొందుతున్న రోగు లు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. కొందరికి చలి జ్వరం వచ్చింది. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.

విషయం తెలుసుకున్న వైద్యాధికారి వీరందరికీ విరుగుడు మందులు ఇస్తూనే పోలీసులు, ఉన్నతాధికారులకు తెలియజేశారు. రోగుల సహాయకులు భారీగా చేరుకోవడంతో అక్కడ ఆందోళన నెలకొంది.

హోం మంత్రి వంగలపూడి అనిత కలెక్టర్‌తో మాట్లాడా రు. చివరకు అంబులెన్స్‌ల్లో 17 మందిని అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు.

బాధితుల్లో సింహాద్రి అనే రోగి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యాధికారి తెలిపారు. ఇంజక్షన్లు వికటించడంపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు..

Updated On 10 July 2024 11:25 AM IST
cknews1122

cknews1122

Next Story