రియల్టర్ దారుణ హత్య కమ్మదనం ఫామ్ హౌస్ లో రియల్టర్ కమ్మరి కృష్ణ దారుణ హత్య భార్య ముందే కత్తితో గొంతు కోసి చంపిన దుండగులు బాబా అనే వ్యక్తి హత్యలు ప్రధాన సూత్రధారి శంషాబాద్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు మార్గమధ్యంలో మృతి భూ లావాదేవీలే కారణమని అనుమానం సి కె న్యూస్ షాద్ నగర్: జూలై 10 రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్మదనం గ్రామంలో ప్రముఖ రియల్టర్ కమ్మరి కృష్ణ …

రియల్టర్ దారుణ హత్య

కమ్మదనం ఫామ్ హౌస్ లో రియల్టర్ కమ్మరి కృష్ణ దారుణ హత్య

భార్య ముందే కత్తితో గొంతు కోసి చంపిన దుండగులు

బాబా అనే వ్యక్తి హత్యలు ప్రధాన సూత్రధారి

శంషాబాద్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు మార్గమధ్యంలో మృతి

భూ లావాదేవీలే కారణమని అనుమానం

సి కె న్యూస్ షాద్ నగర్: జూలై 10

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్మదనం గ్రామంలో ప్రముఖ రియల్టర్ కమ్మరి కృష్ణ అలియాస్ కేకే దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో తన ఫామ్ హౌస్ లో ఉన్న కేకే వద్దకు బాబా అనే వ్యక్తి వచ్చాడు.

టీ పెట్టమని చెప్పగా టీ తాగిన ఆనంతరం
బాబా గట్టిగా అరుచుకుంటూ కేకే రెండు చేతులు పట్టుకోగా అక్కడే హోండా సిటీ కారులో వచ్చిన మరో ఇద్దరు దుండగులు కమ్మరి కృష్ణ గొంతును కత్తితో కోశారని మృతుడి భార్య మీడియా ముందు పేర్కొంది. గాయపడిన కృష్ణను శంషాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అతను మార్గమధ్యలో చనిపోయాడని చెబుతున్నారు.

రియల్టర్ కేకేను హతమార్చింది బాడీగార్డ్ బాబానే షాద్ నగర్ ఏసిపి రంగస్వామి

షాద్ నగర్ నియోజకవర్గం మండల పరిధిలోనీ కమ్మదనం గ్రామ శివారులోని ఫామ్ హౌస్ లో జరిగిన కేకే కృష్ణ దారుణ హత్యలొ ప్రధాన నిందితుడు బాబాగా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు.

ఆరున్నర గంటలకు పోలీస్ స్టేషన్ కు 100 డయల్ ద్వారా సమాచారం అందిందని రియల్టర్ కేకేను బాడీగార్డ్ బాబా మరి కొంతమందితో కలిసి హత్య చేశారని ఏసిపి రంగస్వామి మీడియాకు తెలిపారు..

Updated On 10 July 2024 10:40 PM IST
cknews1122

cknews1122

Next Story