బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి అరెస్ట్‌ అయ్యారు. వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు బ్రాహ్మణకొట్కూరు పోలీసులు. నందికొట్కూరు బంద్ పాటిస్తున్నాయి విద్యార్థి సంఘాలు. ఈ సందర్భంగా నంద్యాలలోని ముచ్చుమర్రి బాలిక అత్యాచారాన్ని నిరసిస్తూ విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు. ఇక ఈ బంద్ మద్దతిచ్చాయి ప్రైవేటు పాఠశాలలు, కాలేజీ యాజమాన్యాలు. ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేయించాయి విద్యార్థి సంఘ నాయకులు. బాలికల పాఠశాల నుంచి పటేల్ సెంటర్ వరకు విద్యార్థులతో ర్యాలీ …

బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి అరెస్ట్‌ అయ్యారు. వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు బ్రాహ్మణకొట్కూరు పోలీసులు.

నందికొట్కూరు బంద్ పాటిస్తున్నాయి విద్యార్థి సంఘాలు. ఈ సందర్భంగా నంద్యాలలోని ముచ్చుమర్రి బాలిక అత్యాచారాన్ని నిరసిస్తూ విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు.

ఇక ఈ బంద్ మద్దతిచ్చాయి ప్రైవేటు పాఠశాలలు, కాలేజీ యాజమాన్యాలు. ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేయించాయి విద్యార్థి సంఘ నాయకులు.

బాలికల పాఠశాల నుంచి పటేల్ సెంటర్ వరకు విద్యార్థులతో ర్యాలీ తీశారు.. పటేల్ సెంటర్లో మానవ మృగాలను శిక్షించాలని ధర్నా చేశారు విద్యార్థులు.

అయితే… నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రిలో చిన్నారి వాసంతి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు బ్రాహ్మణకొట్కూరు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Updated On 12 July 2024 6:17 PM IST
cknews1122

cknews1122

Next Story