శభాష్ ఖమ్మం ట్రాఫిక్ పోలిస్…
👉మానవత్వం చాటుకున్న ఆటో డ్రైవర్..
👉చాకచక్యంగా వ్యవహరించి కొద్ది నిమిషాల్లోనే ఖరీదు ఐన సెల్ ఫోనును ప్రయాణికురాలుకు అందజేసిన ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు.
సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం
ఎవరైనా..వస్తువుని.. పోగొట్టుకుంటే…మర్చిపోతే.. ఆదమరిస్తే…ఇట్టే హంఫట్..అనిపించే. ఈసమాజంలో ఒక ఆటోలో ప్రయాణికురాలు 20వేల రూపాయల ఖరీదైన సెల్ ఫోనును మర్చిపోయిoది.
బాధితురాలు ఖమ్మం ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించగా.. ట్రాఫిక్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి తను పోగొట్టుకున్న సెల్ ఫోన్ కు ఫోన్ చేసి..తన ఫోన్ ను తనకు అందజేసిన ఘటన శనివారం ఖమ్మం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది..
వివరాల్లోకి వెళితే..ప్రయాణికురాలు శిరీష ఖమ్మం రూరల్ మండలంలోని శ్రీసిటీ ప్రాంతం నుంచి ఆటోలో ఖమ్మం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ కు పయనమయింది..
ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్ ప్రాంతం వద్దకు రాగానే ప్రయాణికురాలు శిరీష ఆటో దిగి తన సెల్ ఫోను ఆటోలో మరిచిపోయింది.. కొంత దూరం వెళ్ళాక ప్రయాణికురాలు సెల్ ఫోనును పోగొట్టుకున్నానని గ్రహించి వెనువెంటనే సమీపంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించింది..
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఎఎస్ఐ అమీర్ అలి, కానిస్టేబుళ్లు జి శ్రీనివాస్ , దేవేందర్ లు… ప్రయాణికురాలు శిరీష పోగొట్టుకున్న ఫోన్ కు ఫోన్ చేయగా ఆటోడ్రైవర్ కృష్ణారావు ఫోన్ కాల్ ను లిఫ్ట్ చేశాడు..
పోలీసులు చాకచక్యంగా ఆటో డ్రైవర్ ను సెల్ ఫోన్ ను తీసుకొని వచ్చే విధంగా మానవీయతతో కూడిన సంభాషణలను ఆటో డ్రైవర్ కృష్ణారావుతో సంభాషించగా ఆటోడ్రైవర్ కూడా తన మానవీయతను చాటుకుని సెల్ ఫోన్ ను తీసుకుని వచ్చి ఖమ్మం ట్రాఫిక్ పోలీసులకు అందించాడు.. ఈక్రమంలో ప్రయాణికురాలు శిరీష పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను పోలీసుల సమక్షంలో అందజేశారు..
ఈసందర్భంగా మానవీయతను చాటుకున్న ఆటో డ్రైవర్ కృష్ణారావును పోలీసులు అభినందించగా.. వెంటనే స్పందించి ఖరీదైన ఫోన్ ను ప్రయానికురాలు శిరీషకు అందజేసిన ట్రాఫిక్ పోలీసులను ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాసులు, సిఐ మోహన్ బాబు ప్రత్యేకంగా ప్రశంసించారు..విధి నిర్వహణలో ఇలా ఎలెర్ట్ గా ఉంటూ.. ప్రజల ధన, మాణ, ప్రాణాలను కాపాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసుగా ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు..