వృద్ధుల నుండి ఆసరా పెన్షన్ డబ్బులు రికవరీ
తెలంగాణ రాష్ట్రంలోని పెన్షన్ దారులకు రేవంత్ రెడ్డి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. వృద్ధుల నుండి ఆసరా పెన్షన్ డబ్బులు రికవరీ చేసేందుకు రేవంత్ సర్కార్ కంకణం కట్టుకుంది.
కొత్తగూడెం జిల్లాలో ఆసరా పెన్షన్లపై ఇటీవల సర్వే నిర్వహించగా దాసరి మల్లమ్మ (80) అనే వృద్ధురాలు ఆసరా పెన్షన్‌కి అనర్హురాలు అని.. ఇప్పటివరకు ఆమె తీసుకున్న రూ. 1,72,928 తిరిగి ప్రభుత్వానికి 7 రోజుల లోగా చెల్లించాలని ఆమెకు నోటీసు ఇచ్చారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లు అందుకున్న వారికి నోటీసులు ఇచ్చి వారి నుంచి పింఛన్ డబ్బుల రికవరీకి నోటీసులు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై మంత్రి సీతక్క స్పందించారు. దాసరి మల్లమ్మకు వృద్ధాప్య పెన్షన్ తిరిగి ఇవ్వాలని పంపిన నోటీసులపై మంత్రి వివరణ ఇచ్చారు. దాసరి మల్లమ్మకు కుమార్తె ANM గా పనిచేస్తూ.. ఇటీవల మృతి చెందారు.
దీంతో దాసరి మల్లమ్మకు రూ. 24.073 కుటుంబ పెన్షన్ వస్తుంది. అలాగే.. వృద్ధాప్య పెన్షన్ కూడా తీసుకుంటుంది.
రూల్స్ ప్రకారం ఒకే వ్యక్తి రెండు పెన్సన్లు తీసుకోవడం రూల్స్ కు విరుద్ధం అని గుర్తు చేశారు. కొద్ది రోజుల నుంచి అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వారిని గుర్తించి వారికి నోటీసులు ఇస్తున్నామని..
ఈ క్రమంలోనే తాజాగా 1,826 మంది 2 పెన్షన్ పొందుతున్నట్లు గుర్తించిన వారికి నోటీసులు జారీ చేశామని ఇందులో భాగంగా దాసరి మల్లమ్‌కు నోటీసులు వెళ్లాయని మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు.