నేను రాను బిడ్డో సర్కారు ధవాఖానా కు... చిట్టి రాస్తే లంచం వీడు గేటు తీస్తే లంచం... రోగులకు సకాలంలో అందని వైద్యం.! వందలాది మంది గర్భిణీ స్త్రీలు..! ఒక్కరే గైనకాలజిస్టు..! వైద్యుల కొరతతో ప్రభుత్వాసుపత్రి విల విల.! రోజుకు వందలాది సంఖ్యలో రోగులు.! అంకెల్లో మాత్రమే వైద్య సిబ్బంది.! షాద్ నగర్ ప్రభుత్వసుపత్రిలో వైద్యుల కొరత తీరేనా.! 86 మంది ఉండాల్సిన వైద్య సిబ్బందికి కేవలం 42 మంది మాత్రమే.! ఆరుగురు గైనకాలజిస్టులకు ఒక్కరే దిక్కు.! …

నేను రాను బిడ్డో సర్కారు ధవాఖానా కు...

చిట్టి రాస్తే లంచం వీడు గేటు తీస్తే లంచం...

రోగులకు సకాలంలో అందని వైద్యం.!

వందలాది మంది గర్భిణీ స్త్రీలు..!

ఒక్కరే గైనకాలజిస్టు..!

వైద్యుల కొరతతో ప్రభుత్వాసుపత్రి విల విల.!

రోజుకు వందలాది సంఖ్యలో రోగులు.!

అంకెల్లో మాత్రమే వైద్య సిబ్బంది.!

షాద్ నగర్ ప్రభుత్వసుపత్రిలో వైద్యుల కొరత తీరేనా.!

86 మంది ఉండాల్సిన వైద్య సిబ్బందికి కేవలం 42 మంది మాత్రమే.!

ఆరుగురు గైనకాలజిస్టులకు ఒక్కరే దిక్కు.!

ప్రతినెలా 120 మందికి పైగా డెలివరీలు.!

నాటి నుండి నేటి వరకు అదే దుస్థితి.!

పట్టించుకోని పాలకవర్గం

సి కే న్యూస్ షాద్ నగర్ : జూలై 13

నేను రాను బిడ్డో సర్కారు ధవాఖానాకు మందుళ్ళు గోళీలు అంటూ ఎర్రనీళ్ల మందు సున్నపు నీళ్ల సూదులు నేను రాను బిడ్డో సర్కారు ధవాఖానకు కడుపు నొప్పి అంటూ సర్కారు దవాఖానకు పోతే కాంపౌండర్ వచ్చి కాలుకు పట్టి కట్టే కన్నుకు బాధ అంటూ సర్కారు ధవాఖానకు పోతే ఉన్న కన్నులే పీకేస్తారంట నేను రాను బిడ్డో సర్కారు ధవాఖానా కు వాడు చిట్టి రాస్తే లంచం వీడు గేటు తీస్తే లంచం నేను రాను బిడ్డో సర్కారు ధవాఖానా కు ఇది ఓ సినిమాలో ఓ పాత్ర కానీ ప్రస్తుతం సరిపడా వైద్య సిబ్బంది లేక అటు గర్భిణీ స్త్రీలు ఇటు చిన్నారులు రోగులు సైతం సర్కారు ధవాఖానకు అడుగు పెట్టాలంటే భయపడుతున్న పరిస్థితి నెలకొంది

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కమ్యూనిటీ ఆసుపత్రిలో నాటి నుండి నేటి వరకు సరిపడా వైద్య సిబ్బంది లేకపోవడంతో ఉన్న సిబ్బందికే పని భారంగా మారింది ఆరుగురు గైనకాలజిస్టులు ఉండాల్సిన ప్రభుత్వసుపత్రిలో ఒక్కరే విధులు నిర్వహిస్తుండడం దానికి తోడు గతంలో ప్రతి నెల 60 మంది గర్భిణీ స్త్రీల డెలివరీలు అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 120 కి పైగా చేరింది

షాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మండలాలైనటువంటి కొందుర్గు చౌదర్ గూడ కేశంపేట నందిగామ కొత్తూరు మండలాల నుండే కాకుండా షాబాద్ బాలనగర్ మండలాల నుంచి కూడా గర్భిణీ స్త్రీలు సైతం ఇక్కడికి వైద్యం కోసం వస్తున్న పరిస్థితి నాటి నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉంది గర్భిణీ స్త్రీలకు ప్రతి సోమవారము గురువారము ఓపి చూడడంతో పాటు ప్రతి బుధవారము నాడు వారికి నార్మల్ డెలివరీలతో పాటు అవసరమయ్యే వారికి సిజేరియన్లు కూడా చేస్తున్నారు

ఒక్కరే గైనకాలజిస్ట్ ఉండడంతో వారిపైనే తీవ్ర పనిభారం పడుతుంది ఇక చిన్న పిల్లలకు సంబంధించి పీడియాట్రిక్ వైద్యులు ఆరు మంది ఉండాల్సి ఉండగా నలుగురు మాత్రమే ఉన్నారు సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ ఇరవై రెండు మందికి గాను కేవలం ఐదుగురే మాత్రమే ఉన్నారు సిఎస్ఎస్ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ కు సంబంధించి తొమ్మిది మందికి ఏనిమిది మంది ఉన్నారు

ఇక ల్యాబ్ టెక్నీషియన్స్ ఫార్మసిస్ట్ నర్సింగ్ స్టాప్, స్టాఫ్ నర్స్ జూనియర్ అనాలిస్ట్ ఇలా మొత్తం 86 మందికి కేవలం 42 మంది మాత్రమే ఉండడంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పడుతుందని ప్రభుత్వం పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు

అత్యవసర సమయంలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కూడా లేకపోవడంతో గర్భిణీ స్త్రీలను హైదరాబాద్ జెజ్జీఖానా పాముకాటుకు గురై పురుగుల మందు తాగి రోడ్డు ప్రమాదానికి గురైన వారిని మెరుగైన సౌకర్యాలు లేకపోవడంతో హైదారాబాద్ ఉస్మానియాకు రేఫర్ చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మెరుగైన సౌకర్యాలతో పాటు పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు ప్రజలు.

Updated On 13 July 2024 7:30 PM IST
cknews1122

cknews1122

Next Story