CMRF చెక్కులను పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి
సికె న్యూస్ ప్రతినిధి
కూసుమంచి : నిరుపేదల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఆదివారం కూసుమంచి మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో పాలేరు నియోజకవర్గానికి చెందిన 132 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
అనంతరం జుజ్జుల్ రావు పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు రాజ శేఖర్ రెడ్డి తల్లి వెంకట నరసమ్మ ఇటీవల ఆరోగ్యంతో మృతి చెందగా మరి స్వగృహం నందు నరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబాన్ని ఓదార్చి సంతాన సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూసుమంచి ఎంపీపీ బానోత్ శ్రీనివాస్ నాయక్, మల్లయిగూడెం మాజీ సర్పంచ్ రవి, ఎంపీటీసీ మాదాసు ఉపేందర్ రావు, జొన్నలగడ్డ రవి, మాజీ సర్పంచ్ చాట్ల పరశురామ్, మండల, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.